జగన్.. క్యాండేట్లను డిసైడ్ చేసేస్తున్నాడా ?

0jagan-candidates-for 2014-electionsవైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల కోసం సిద్ధం అవుతున్నాడా? ఒకవైపు సమైక్యవాదం అంటూ పార్టీని ప్రజల్లోకి తీసుకెవెళుతూనే మరోవైపు తన పార్టీ తరపున వచ్చే ఎన్నికల్లోపోటీ చేసే అభ్యర్థుల విషయంలో ఆయన ఒక నిర్ధారణ కువస్తున్నాడా? మరో నాలుగు నెలల్లో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానున్న నేపథ్యంలో జగన్ మోహన్ రెడ్డి అభ్యర్థుల జాబితాను సిద్ధం చేసుకొంటున్నాడని తెలుస్తోంది.

ఇప్పటికే అభ్యర్థుల విషయంలో చాలా కసరత్తు చేసిన జగన్ మోహన్ రెడ్డి లిస్టులను ఫైనలైజ్ చేస్తున్నాడట.  తెలంగాణ విషయాన్ని పక్కనపెడితే సీమాంధ్రలో వైకాపా టికెట్ కు బాగానే గిరాకీ ఉంది. ఒక్కో నియోజకవర్గంలో చాలా మంది నేతలు వైకాపా టికెట్ విషయంలో పోటీ పడుతున్నారు. ఇందుకు తగ్గట్టుగా జగన్ కూడా కొన్ని నియోజకవర్గాల్లో ఇద్దరు, ముగ్గురు సమన్వయకర్తలను నియమించాడు. అలాగే సమన్వయ కర్తలకు టికెట్ గ్యారెంటీ అనే హామీని కూడా ఇవ్వలేదు జగన్ మోహన్ రెడ్డి. దీంతో టికెట్ల విషయంలో ఎవరికి వారు ఇంకా అపనమ్మకంతోనే ఉన్నారు.

పార్టీ తరపున నామినేషన్ వేసే వరకూ నమ్మకాలు లేవనే భావనతో ఉన్నారు నేతలంతా!  ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. ఆ మధ్య జగన్ పార్టీలోని నియోజకవర్గ సమన్వయకర్తలకు, టికెట్ విషయంలోని ఆశావహులకు తగాదాలు వచ్చాయి. అనేక చోట్ల ఇన్ చార్జిలు, ఆశావహులు తన్నుకొనే పరిస్థితి వచ్చింది. అయితే ఇప్పుడు అలాంటిపరిస్థితేమీ కనపడటం లేదు. వరసగా అనేక నియోజకవర్గాల్లో గొడవలు చెలరేగడంతో జగన్ పార్టీ పరిస్థితి అయిపోయిందనుకొన్నారంతా! అయితే.. సమైక్వవాద ఉద్యమం చెలరేగడంతో నేతలు, ప్రజల దృష్టి ఉద్యమాల మీదకు మళ్లింది. దీంతో జగన్ కు చాలా రిలీఫ్ దొరికింది.

ఇదే సమయంలో జైలు నుంచి బయటకు వచ్చిన జగన్ మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా తనను మీట్ అవుతున్న నేతలకు టికెట్ విషయంలో క్లారిటీ ఇస్తున్నాడట. కొంతమంది సమన్వయకర్తలకు నిర్మొహమాటంగా టికెట్ విషయంలో ఉన్న అభ్యంతరాల గురించి స్పష్టంగా వివరిస్తున్నాడట జగన్ మోహన్ రెడ్డి. దీంతో వచ్చే ఎన్నికల పోటీ విషయంలో అభ్యర్థుల గురించి జగన్ ఒక అంచనాకు వచ్చేసినట్టేనని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. Source- APH

Tags : YSRCP,Jagan,Samaikyandhra,Party, Jagan finalising candidates for 2014 Elections, YSRCP candidates for 2014 Elections