జగన్ కు ఓటు వేసి ముఖ్యమంత్రిని చెయ్యండి – పోసాని

0సినీ దర్శకుడు & నటుడు పోసాని కృష్ణ మురళి , ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తో కలిసి పాదయాత్ర చేసాడు. శనివారం ఉదయం నైట్‌ క్యాంపు(ఆకివీడు) నుంచి 172 వ రోజు జగన్ యాత్ర మొదలయ్యింది. ఈ సందర్భాంగా పోసాని , జగన్ తో కలిసి పాదయాత్ర లో పాల్గొన్నారు. కాసేపు ఆయనతో కలిసి నడుస్తూ ప్రజల సమస్యలు తెలుసుకున్నారు.

ఆ తర్వాత మీడియా తో పోసాని మాట్లాడారు..‘జగన్‌లోని ధృడ సంకల్పం నన్ను ఆకర్షించింది. అందుకే ఆయనకు మద్దతుగా పాదయాత్రలో పాల్గొన్నాను. అన్ని వర్గాల సమస్యలు పరిష్కరించే నాయకుడు వైఎస్‌ జగన్‌. ఆయనలో సంకల్పం చూసి ఆశ్చర్యం వేసింది. ఇది చరిత్రలో నిలిచిపోయే పాదయాత్ర. మూడు వేల కిలోమీటర్లు నడవడం అంటే మామూలు విషయం కాదు. నేను రెండు, మూడు కిలోమీటర్లు కూడా నడవలేకపోయా. సమస్యల పరిష్కారంపై నిబద్ధత కలిగిన నాయకుడిగా ఆయనకు ఓటువేసి ముఖ్యమంత్రిని చేయండి. నేను రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఒక్కసారి మీరు ఓటు వేస్తే మీరే మళ్లీ మళ్లీ ఆయనను గెలిపిస్తారు.’ అంటూ పోసాని తెలిపారు.