పవన్ కళ్యాణ్‌కు వైఎస్ జగన్ కంపెనీ రూ. 15 కోట్ల పారితోషికమా…?

0


pawan-kalyan-jagan-remunerationపవన్ కళ్యాణ్‌కు వైఎస్ జగన్ కంపెనీ రూ. 15 కోట్ల పారితోషికమా…? అనేది తెలుసుకునేముందు మన తెలుగు ఇండస్ట్రీలో నటీనటుల పారితోషికాల వ్యవహారం ఎలా ఉందో చూద్దాం. సినిమా రంగంలో హీరోలకు హీరోయిన్లకు ఉన్న డిమాండ్‌ ఇతర నటీనటులకు లేదు. క్యారెక్టర్‌ ఆర్టిస్టులు నిర్మాతలు చెప్పిందే తీసుకోవాలి. ఎలాగూ విలన్లు పరభాషావారు కనుక.. వారికి తక్కువేం ఇవ్వరు. ఎటొచ్చీ… అన్యాయం అయిపోయేది మిగిలిన తారాగణమే. ఇటీవలే తారల రెమ్యునరేషన్‌ గురించి, ఇతర సమస్యల గురించి ఫిలింఛాంబర్‌లో చర్చ జరిగింది.

ఒక్కో హీరో తీసుకున్న రెమ్యునరేషన్‌ చెబితే.. కంగారుపడాల్సిందే. అయితే వీటికి ఎక్కడా ఆధారాలు ఉండవు కనుక.. నిర్మాత చెప్పినట్లు ఇవ్వడంతో… సరైన సాక్ష్యాలు లేకుండాపోతాయి. సినిమా హిట్‌ అయితే నిర్మాత సేఫ్‌. లేకపోతే… అంతే సంగతులు. అయినా నిర్మాతలు ఎగబడుతూనే ఉన్నారు. ఇలాంటి వారిని కంట్రోల్‌ చేయాలని అనుకున్నారు. ఇది అయ్యేపని కాదని కొందరు సభ్యులు తెలిపినట్లు సమాచారం. అయితే ఎవరెవరు ఎంతెంత తీసుకుంటున్నారో… ఒక్కసారి పరిశీలిద్దాం.

మహేష్‌బాబు…. దాదాపు రూ. 10 కోట్లు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. త్వరలో యుటీవీ సంస్థ తీసే చిత్రంలో మరింత పెరిగే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. పవన్‌ కళ్యాణ్‌ గబ్బర్‌సింగ్‌ తర్వాత ఓ నిర్మాత బ్లాంక్‌ చెక్‌ ఇచ్చి… ఎంతైనా రాసుకోండని చెప్పాడట. కానీ పవన్‌ చెప్పిన ఎమౌంట్‌ నిర్మాత రాసినట్లు… దాదాపు రెండకెలు కోట్లు పారితోషికంగా తీసుకున్నాడు. కాగా, మరో ఆసక్తికరమైన విషయం ఏమంటే… వైఎస్‌ జగన్‌కు చెందిన పీవీపి సంస్థ పవన్‌తో సినిమా తీయడానికి ముందుకు వచ్చింది. వారు భారీగా ఇస్తున్నట్లు తెలుస్తోంది. దాదాపు రూ. 15 కోట్లకు చేరుకోవచ్చని తెలుస్తోంది.

పవన్ కళ్యాణ్‌కు వైఎస్ జగన్ కంపెనీ రూ. 15 కోట్ల పారితోషికమా…?, jagan remuneration to pawan kalyan, pawan kalyan remuneration, pawan kalyan remuneration for attarintiki daredi