త‌మ్ముడికి షాక్ ఇవ్వనున్న జ‌గ‌న్..?

0jagan-mohan-reddy-speechనిన్న‌టి వ‌ర‌కు వైఎస్‌.జ‌గ‌న్ బాగా న‌మ్మిన ఓ వ్య‌క్తికి ఇప్పుడు బిగ్ షాక్ త‌ప్ప‌ద‌న్న గుస‌గుస‌లు క‌డ‌ప పాలిటిక్స్‌లో వినిపిస్తున్నాయి. వైఎస్‌.జ‌గ‌న్‌కు సోద‌రుడు అయిన అవినాష్‌రెడ్డికి జ‌గ‌న్ గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ త‌ర‌పున క‌డ‌ప ఎంపీ సీటు ఇచ్చారు. గ‌త ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ సోద‌రి ష‌ర్మిల కూడా క‌డ‌ప ఎంపీ సీటు ఆశించారు. అయితే ష‌ర్మిల‌ను ప‌క్క‌న పెట్టి కూడా జ‌గ‌న్ అవినాష్‌కే క‌డ‌ప ఎంపీ సీటు ఇచ్చారు. అవినాష్ భారీ మెజార్టీతో విజ‌యం సాధించారు.

ఇక ఇటీవ‌ల అవినాష్ తీరుపై జ‌గ‌న్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. క‌డ‌ప జిల్లాలో జ‌రిగిన స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో పార్టీకి బ‌లం ఉన్నా త‌న చిన్నాన్న వివేకానంద‌రెడ్డి ఓడిపోయారు. ఈ ఓట‌మికి జిల్లా పార్టీ అధ్య‌క్షుడిగా ఉన్న అవినాష్‌రెడ్డినే జ‌గ‌న్ బాధ్యుడిగా చేశారు. పార్టీకి బ‌లం ఉన్న చోటే అవినాష్ మేనేజ్‌మెంట్ చేయ‌క‌పోవ‌డంతో పాటు పార్టీ ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న అభ్య‌ర్థి ఓట‌మికి కార‌ణ‌మ‌వ్వ‌డంతో జ‌గ‌న్ అవినాష్‌పై తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్న‌ట్టు తెలుస్తోంది.

ఇటీవ‌ల జ‌రిగిన పార్టీ స‌మ‌న్వ‌య‌క‌మిటీ స‌మావేశంలో సైతం అవినాష్‌ను జ‌గ‌న్ బాగా టార్గెట్ చేసిన‌ట్టు స‌మాచారం. ఇక ఈ నేప‌థ్యంలోనే జ‌గ‌న్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో క‌డప ఎంపీ సీటును అవినాష్‌కు ఇవ్వ‌డ‌న్న టాక్ కూడా వ‌చ్చేసింది. త‌న భార్య భార‌తిని జ‌గ‌న్ ఇక్క‌డ నుంచి బ‌రిలోకి దింపుతార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. రాజ‌కీయంగా త‌న‌పై ఉన్న కేసులు దృష్ట్యా ఎలాంటి ఇబ్బందులు వ‌చ్చినా భార‌తి అండ‌గా ఉంటుంద‌న్న ఆలోచ‌న‌తోనే జ‌గ‌న్ భార‌తిని ఇక్క‌డ నుంచి ఎంపీ బ‌రిలో దించుతాడ‌ని స‌మాచారం. అదే జ‌రిగితే అవినాష్ రెడ్డికి జ‌గ‌న్ అదిరిపోయే షాక్ ఇచ్చిన‌ట్టే.