తెలంగాణలో జగన్‌ స్టాటజీ ఏంటి…?

0


jagan-telanganaరాష్ట్ర విభజన జరిగిపోయింది…ఇక ఎన్ని చేసినా ఏమి చేసినా ఎవ్వరూ ఎమి చేయలేరు…దీంతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికలపై దృష్టి పెట్టింది. మరోవైపు ఎన్నికలు ఉమ్మడి రాష్ట్రంలో జరుగుతాయన్న సంకేతం కేంద్ర ఎన్నికల సంఘం నుంచి సమాచారం అందుతోంది..దీనితో తెలంగాణలో కూడా పార్టీ భవిష్యత్తును నిలుపుకోవడానికి జగన్‌ ప్రయత్నాలు ప్రారంభించాడు..అందుకే తెలంగాణకు సంభందిచిన ముఖ్య నాయకులను పిలిపించి తెలంగాణలో కూడా ఓదార్పు యాత్ర చేయడానికి రూట్‌ మ్యాప్‌ గీయించాడు..అసలు తెలంగాణలో జగన్‌ ఎలాంటి వ్యూహాన్ని అవలంబించనున్నారు. అందుకు తగ్గట్టు పార్టీ చేసిన కసరత్తు ఎంటి..?

పూర్తిగా సమైక్యాంధ్ర నినాదం అందుకున్న జగన్‌ తెలంగాణ వచ్చిన తరువాత ఒక్క సారిగా మళ్లీ అదే తెలంగాణలో యాత్ర చేస్తాననడం ఏంటి..నిజంగా ఇది జరిగే పనేనా అని అందరూ అనుకుంటున్నారు..తెలంగాణ రాష్ట్ర ప్రకటన రాకముందే ఎంతో ప్రతిఘటనను ఎదుర్కొన్న జగన్‌ ఇప్పుడు ఏ విధంగా వెళ్లనున్నారన్నది ఆశక్తిగా మారింది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు తెలంగాణలో బిజెపి బాగా పుంజుకుంటుంది. పూర్తిగా టిఆర్‌ఎస్‌కు గంప గుర్తుగా సీట్లు వచ్చే అవకాశం లేదు… అంతేకాక కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవాలనుకుంటున్న టిఆర్‌ఎస్‌ ఆపార్టీలో సీట్లు దొరకని వారు ఖచ్చితంగా అటు బిజెపి కాని లేక వైసిపి టికెట్‌ కోసం వస్తారు.

ఖమ్మం, నల్గోండలో సీమాంధ్రులు ఉన్న ప్రాంతంలో ఇప్పటికి ప్రత్యేక వాదం పెద్దగా లేదు ఇక్కడ కొన్ని సీట్లు ,హైదరాబాద్‌లో కొన్ని సీట్లు గెలిస్తే ప్రభుత్వంలో భాగస్వామం అయ్యే అవకాశం ఉందని జగన్‌ విశ్వాసంతో ఉన్నాడు. అంతేకాక తెలంగాణలో వైఎస్సార్‌ అభిమానులు చాలా మంది ఉన్నారు. ఈ విషయం చాలా సర్వేలలో కూడా తేలింది. మరి ఈ పరిస్థితుల్లో తెలంగాణలో జగన్‌ ను అడుగు పెట్టనిచ్చి ప్రజలు ఆదరిస్తారా అన్నది…చూడాలి.