పాదయాత్రలో జగన్ ధరించిన షూ.. దిమ్మతిరిగే ధర..

0Jagan-Padayatraఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ఏది చేసినా కొత్తదనంగా వుంటుందని చెప్పుకుంటుంటారు. ఆ విషయాన్ని గురించి అందరూ మాట్లాడుకునేలా చేస్తుంటారు జగన్. ఈ నెల 6వ తేదీ ప్రజా సంకల్ప యాత్ర పేరుతో పాదయాత్ర ప్రారంభించి ఇడుపుల పాయ నుంచి బయలుదేరారు. అయితే ఇందులో కొత్తేమీ లేదు కానీ.. పాదయాత్రలో జగన్ వాడుతున్న షూ గురించే ఇప్పుడు చర్చ నడుస్తోంది.

3 వేల కిలోమీటర్ల పాదయాత్రలో మొదటి రోజు జగన్ సాదాసీదా చెప్పులతో నడిచారు. రెండవ రోజు ప్రత్యేకంగా డిజైన్ చేసిన షూలను వేసుకున్నారు. ఈ షూ ధర తెలిస్తే దిమ్మతిరుగుతుంది. దీని ఖరీదు రూ. 60 వేలు. ప్రత్యేకంగా జగన్ కోసమే ఈ షూను తయారుచేయించారట.

ఈ షూ స్పెషాలిటీ ఏంటంటే ఈ షూతో పాదయాత్ర చేస్తే పాదాలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అంతేకాదు పాదానికి, మడమకు మొత్తంగా కాలికి రక్తప్రసరణ సరిగ్గా చేసే విధంగా షూ డిజైన్ చేయబడింది. ఈ షూ వేసుకుంటే 3 వేల కిలోమీటర్లు కాదు… ఏకంగా 30 వేల కిలోమీటర్లు కూడా ఈజీగా జగన్ నడిచేయవచ్చట.