బాండ్ గర్ల్ పై జగపతిబాబు ‘హాట్’ కామెంట్స్!

0అడివి శేష్ శోభితా ధూళిపాళ్ల జంటగా నటించిన `గూఢచారి `చిత్రం ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ప్రేక్షకులతో పాటు విమర్శకులు – సెలబ్రిటీల ప్రశంసలు దక్కించుకున్న ఈ చిత్రం మంచి కలెక్షన్లు రాబడుతోంది. ఓవర్సీస్ లోనూ గూఢచారికి మంచి టాక్ వచ్చింది. అదే ఊపులో బాండ్ సిరీస్ తరహాలో….గూఢచారి సిరీస్ ను ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంపై హీరో నాగార్జున ప్రశంసల జల్లు కురిపించాడు. ఇటువంటి సినిమాలు మేమేందుకు తీయలేకపోతున్నామంటూ వాపోయాడు. అదే తరహాలో హీరో జగపతిబాబు కూడా ఈ సినిమాకు కాంప్లిమెంట్స్ ఇచ్చాడు. ఆ చిత్ర హీరోయిన్ – తెలుగమ్మాయి…శోభిత ధూళిపాళ్లపై జగపతిబాబు షాకింగ్ కామెంట్స్ చేశాడు. శోభిత సూపర్ హాట్ గా ఉందంటూ కితాబిచ్చాడు. శోభితపై జగపతిబాబు కామెంట్స్ వైరల్ అయ్యాయి.

ఇండస్ట్రీలోకి జగపతిబాబు అడుగుపెట్టి 30 సంవత్సరాలు అయిన సందర్భంగా …గూఢచారి టీం..ఆయనను సన్మానించింది. ఈ సందర్భంగా జగపతిబాబు మాట్లాడుతూ చిత్ర యూనిట్ అందరినీ అభినందించాడు. అందుబాటులో ఉన్న వనరులతోనే అందరూ బాగా పనిచేశారని ప్రశంసించాడు. శోభిత చాలా బాగా పర్ ఫార్మ్ చేసిందని – తనకు నచ్చిందని….షీ ఈజ్ సూపర్ హాట్ అంటూ జగపతిబాబు షాకింగ్ కాంప్లిమెంట్స్ ఇచ్చారు. ఈ చిత్రం గురించి నాగార్జున చాలా వరకు చెప్పేశాడని అందుకు నాగ్ కు థ్యాంక్స్ అని చెప్పాడు. నాగ్ కు ఈ సినిమాకు సంబంధం లేదని కానీ సినిమా చూసి జెన్యుయన్ గా నేనున్నా అని అండగా ఉన్నాడని చెప్పాడు. గూఢచారితో పాటు తమ చిలసౌ రిలీజ్ అయినా…. గూఢచారికి దన్నుగా నిలిచాడని…దటీజ్ నాగార్జున అని అన్నాడు. ఒక్క సినిమా హీరోగా చేస్తే చాలు అని 30 ఏళ్ల క్రితం ఇండస్ట్రీకి వచ్చానని… కానీ 30 సంవత్సరాలుగా తనను ఆదరించిన ప్రేక్షకులకు సహకరించిన ఇండస్ట్రీకి కృతజ్ఞతలని చెప్పాడు.