నోట్లో బుల్లెట్టు.. ముక్కుపై గాటు!!

0

`లెజెండ్` చిత్రంతో విలన్ గా ఎంట్రీ ఇచ్చాడు జగపతిబాబు అలియాస్ జగ్గూభాయ్. ఆ తర్వాత వెనుదిరిగి చూసిందే లేదు. ఈగోలకు పోకపోతే నటుడిగా ఎదిగేందుకు ఛాన్సుందని నిరూపించాడు. జగపతి మోస్ట్ సక్సెస్ ఫుల్ విలన్ కం క్యారెక్టర్ ఆర్టిస్ట్ పరిశ్రమలో. ఇటీవలే `రంగస్థలం` చిత్రంలో అద్భుతమైన పాత్రలో నటించి మెప్పించాడు. పల్లెటూరి మొరటోడు రాజకీయం చేస్తే ఎలా ఉంటుందో పక్కాగా చూపించాడు. రంగస్థలం చిత్రంలో చెంబుతో బాది చంపేసే సీన్ లో జగపతి ఎమోషన్ పీక్స్ ని చూపించింది.

అందుకే ఇప్పుడు `అరవింద సమేత`లో అతడు చేస్తున్న పాత్ర ఏ తరహా? అన్న ఆసక్తి రెయిజ్ అయ్యింది. నిన్న రిలీజైన థియేట్రికల్ ట్రైలర్ లో జగ్గూ భాయ్ కనిపించింది రెండు సెకన్లే కానీ – ఆ పాత్ర ఇంపాక్ట్ ఏంటో ఇట్టే అర్థమైపోయింది. నోట్లో బుల్లెట్టు – ముక్కుపై కత్తి గాటుతో రగ్గ్ డ్ గా కనిపించాడు. సీమ ఫ్యాక్షనిజానికి – అనంతపురం కొడవలి-నాటుబాంబులకు కేరాఫ్ అడ్రెస్ లా కనిపించాడు. తనకు ఆ ఛాన్స్ ఇచ్చింది ఎన్టీఆర్ అని – త్రివిక్రమ్ కి తన పేరు రిఫర్ చేసింది హీరోనే అని ప్రీరిలీజ్ వేడుకలో జగ్గూ భాయ్ చెప్పారు.

మొత్తానికి మరో ఇంట్రెస్టింగ్ రోల్ తగిలింది. మరోసారి తన సత్తా ఎంతో చూపించేందుకు ఆస్కారం దొరికింది. ఎన్టీఆర్ `నాన్నకు ప్రేమతో` చిత్రంలో క్లాస్ విలన్ గా నటించిన జగ్గూభాయ్ ని ఈసారి అదే ఎన్టీఆర్ సినిమాలో కర్కశ ఫ్యాక్షనిస్టుగా చూడబోతున్నాం. ఆ రెండు పాత్రల వైవిధ్యం ఏ తీరుగా పండిందో పోల్చి చూసుకోవచ్చు. అందుకు అక్టోబర్ 11 వరకూ ఆగాల్సిందే.
Please Read Disclaimer