జగపతిబాబు అంత మాట అనేశాడేంటి?

0


Jagapathibabu-On-Patel-SIR-హీరోగా కెరీర్ చరమాంకానికి చేరిన దశలో విలన్ వేషాల మళ్లి తన కెరీర్ ను సరికొత్తగా నిర్మించుకున్నాడు జగపతిబాబు. ప్రస్తుతం టాలీవుడ్లోనే కాదు.. మొత్తం దక్షిణాది పరిశ్రమలోనే మంచి డిమాండ్ ఉన్న విలన్ కమ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ జగపతి. విలన్..క్యారెక్టర్ రోల్స్ తో ఆయన కెరీర్ మూడు పువ్వులు ఆరు కాయలన్నట్లుగా సాగిపోతోంది. ఇలాంటి టైంలో మళ్లీ హీరో అవతారం ఎత్తి ‘పటేల్ సార్’ అనే సినిమా చేస్తున్నాడు జగ్గూభాయ్. దీనిపై ఇండస్ట్రీలో కొందరి నుంచి నెగెటివ్ కామెంట్స్ వచ్చాయి. కెరీర్ సాఫీగా సాగిపోతున్న టైంలో మళ్లీ హీరోగా ఈ ప్రయోగాలెందుకు అన్నారు కొంతమంది. ఐతే ఈ మాట బయటి వాళ్లే కాదు తన ఇంట్లో వాళ్లు కూడా అన్నారని అంటున్నాడు జగపతిబాబు.

స్వయంగా తన భార్యే.. ఇప్పుడీ హీరో వేషాలెందుకు అని తనను అడిగినట్లు జగపతి బాబు వెల్లడించాడు. ఐతే ఏదో హీరోగా కనిపించాలనే తాపత్రయంతో తాను ఈ సినిమా చేయలేదన్నాడు జగ్గూ భాయ్. బలమైన కథ దొరికిందని.. ఇందులో తనతో పాటు ప్రతి పాత్రధారీ హీరోనే అని.. అప్పుడప్పుడూ ఇలాంటి వైవిధ్యమైన ప్రయత్నాలు చేస్తుండాలనే ఉద్దేశంతోనే తాను ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నానని అతను తెలిపాడు. అంతే తప్ప తనకు హీరోగా కనిపించాలనే గుల కానీ.. నిర్మాత సాయి కొర్రపాటికి డబ్బులెక్కువైపోయిన బలుపుతో కానీ ఈ సినిమా చేయలేదని.. ప్రేక్షకులకు కూడా అలాంటి భావన కలగదని.. తాను ఎందుకీ సినిమా చేశాననన్నది సినిమా చూశాక అర్థమవుతుందని జగపతి అన్నాడు.