సూర్య చిత్రంలో జగపతిబాబు

0విలక్షణ నటుడు జగపతిబాబు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా అనేక సినిమాలతో బిజీగా ఉంటున్నారు. ఒక పక్క సినిమాలు చేస్తునే మరోపక్క వెబ్ సిరీస్ కూడా నటిస్తూ చాలా బిజీగా ఉంటున్నారు. అయితే కేవలం తెలుగులోనే కాకుండా సౌత్ ఇండియాలోని మిగితా భాషలైన తమిళం, కన్నడ, మలయాళ చిత్రాల్లో కూడా జగపతిబాబుకి కీలకఅవకాశాలు దక్కుతున్నాయి.

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన ” మన్యం పులి”లో విలన్ గా నటించిన జగపతిబాబు, సూపర్ స్టార్ రజనీకాంత్ “లింగా”లోను నటించారు. విజయ్, అజిత్ లాంటి స్టార్స్ అందరితో నటించిన జగపతిబాబు తాజాగా సూర్య చిత్రంలో నటించబోతున్నారు.

శ్రీరాఘవ దర్శకత్వంలో సూర్య నటిస్తున్న “ఎన్ జికె “చిత్రం త్వరలోనే ప్రారంభం కానుంది, ఈ చిత్రంలో జగపతిబాబు ఒక కీలకపాత్రలో కనిపించనున్నారట. ఈ పాత్రకోసం జగపతిబాబు అయితేనే సరైన న్యాయం చేయగలడని పట్టుపట్టి జగపతిబాబును ఎంపిక చేశాడట శ్రీరాఘవ. దీంతో ఇటు తెలుగులోనే కాకుండా అటు తమిళంలో కూడా జగ్గుభాయ్ కి క్రేజ్ భారీగా ఉన్నట్లు తెలుస్తోంది.