జై లవకుశ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. రేటింగ్ ఎంతిచ్చారంటే..

0Jai-Lava-Kusa-Censor-Reportయంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన జై లవకుశ మూవీ రేపు విడుదలకాబోతున్న విషయం విదితమే. ఇటీవల ఈ సినిమా సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది. ఈ నెల 21న జై లవకుశ మూవీ విడుదల కాబోతోంది. ఇతర దేశాల్లో కూడా ఈ సినిమా విడుదల కాబోతున్నందున ఆయా దేశాల్లో సెన్సార్ పూర్తి చేసుకుంది. విదేశాల్లో సెన్సార్ బోర్డు సభ్యుడు, ఇండియన్ సినిమాల క్రిటిక్‌గా ఉమైర్ సంధుకి పేరు. ఆయన ఇండియాలో మూవీస్ రిలీజ్‌కి ముందే రివ్యూలు ఇస్తున్న సంగతి విదితమే. జై లవకుశ మూవీ రివ్యూని కూడా ఇచ్చేశారు.

దర్శకుడు కేఎస్ రవీంద్ర డిటెక్షన్ ఫస్ట్ రేట్‌గా ఉందని, స్టోరీ, స్క్రీన్ ప్లేలో చాలా మాస్ మూమెంట్స్ ఉన్నాయని ఉమైర్ తెలిపారు. సినిమా క్లైమాక్స్ చాలా బాగుందని, స్టంట్స్ అదరగొట్టాయని ఆయన పేర్కొన్నారు. ఇద్దరు హీరోయిన్లు రాశి ఖన్నా, నివేదా థామస్ చాలా బాగా చేశారని స్పష్టం చేశారు. ఎన్టీఆర్‌ను మూడు పాత్రల్లో చూడటం అభిమానులకు పండగలా ఉంటుందని, కొన్ని పాటల్లో ఎన్టీఆర్ డాన్స్‌కి ప్రేక్షకులు ఫిదా అవుతారని ఉమైర్ పేర్కొన్నారు. ఓవరాల్ గా ఈ సినిమాలోని కామెడీ, యాక్షన్ డ్రామా అభిమానులను, ప్రేక్షకులను కట్టిపడేస్తుందని ఆయన తెలిపారు.

ఇక డీ మెరిట్స్ విషయానికి వస్తే.. సినిమాలో కొన్ని చోట్ల సీన్లు చాలా లెన్తీగా ఉన్నాయని, ఎడిటింగ్ ఇంకాస్త బెటర్‌గా ఉంటే బావుండేదని ఉమైర్ భావించారు. మొత్తం మీద జై లవకుశ బ్లాక్ బస్టర్ హిట్ అని.. ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని ఉమైర్ ప్రశంసించారు. ఈ మూవీకి ఆయన 3.5 రేటింగ్ ఇచ్చారు.