ఎన్టీఆర్ మూవీ టీజ‌ర్ రిలీజ్ టైం ఫిక్స్

0Jai-Lava-Kusa-First-Lookయంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ తొలి సారి త్రిపాత్రాభిన‌యం చేస్తున్న చిత్రం జై ల‌వ‌కుశ‌. బాబీ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం ఓ భారీ సెట్ లో షూటింగ్ జ‌రుపుకుంటున్న‌ట్టు తెలుస్తుంది. నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రాశిఖ‌న్నా, నివేదా థామ‌స్ లు క‌థానాయిక‌లుగా న‌టిస్తుండ‌గా, దేవి శ్రీ సంగీతం అందిస్తున్నాడు. ఆ మ‌ధ్య చిత్రానికి సంబంధించి రెండు పోస్ట‌ర్స్ విడుద‌ల చేసిన టీం త్వ‌ర‌లో టీజర్ రిలీజ్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తుంది. రంజాన్ కానుక‌గా టీజ‌ర్ విడుద‌ల కానుంద‌ని ప‌లు వార్త‌లు వ‌చ్చిన నేప‌థ్యంలో చిత్ర నిర్మాణ సంస్థ అఫీషియ‌ల్ ట్విట్ట‌ర్ ద్వారా టీజ‌ర్ రిలీజ్ టైం తెలిపింది. జూలై మొద‌టి వారంలో జై ల‌వ‌కుశ టీజ‌ర్ ని విడుద‌ల చేయ‌నున్నామ‌ని ప్ర‌క‌టించింది. సెప్టెంబ‌ర్ లో జై ల‌వ‌కుశ చిత్ర రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు.