జై లవకుశ యూఎస్ టాక్ ..

0టెంపర్ , నాన్నకు ప్రేమతో , జనతా గ్యారేజ్ చిత్రాల తర్వాత ఎన్టీఆర్ నుండి వచ్చిన చిత్రం ‘జై లవకుశ’. ఎన్టీఆర్, రాశిఖన్నా, నివేదా థామస్ హీరో హీరోయిన్లుగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా సెప్టెంబర్ 21 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అంతకంటే ముందే ఓవర్సీస్ లో ప్రీమియర్ షోస్ పడ్డాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్ తొలిసారిగా మూడు(జై, లవ, కుశ) భిన్నమైన పాత్రలలో నటించడం తో భారీ అంచనాల మధ్య ఈ మూవీ అభిమానుల ముందుకు వచ్చింది..

ఇక యూఎస్ టాక్ మాత్రం సినిమా బ్లాక్ బస్టర్ అంటున్నారు. మొదటి సారి ఎన్టీఆర్ కు కరెక్ట్ కథ దొరికిందని..మూడు పాత్రల్లో ఎన్టీఆర్ అదరగొట్టాడని అంటున్నారు. ముఖ్యం గా జై రోల్ లో మారే ఏ స్టార్ చేయలేడని ఒక్క మాటలో చెపుతున్నారు. ఎన్టీఆర్ తన నట విశ్వరూపాన్ని చూపించాడు..కేవలం యాక్షన్ మాత్రమే కాదు కామెడీ , ప్రేమికుడు ఇలా మూడు కోణాల్లో అద్భుతంగా నటించాడని అభిమానులు చెపుతున్నారు.