మాస్‌ డైలాగుతో జై సింహ టీజర్

0‘సింహం మౌనాన్ని సన్యాసం అనుకోవద్దు. సైలెంట్‌గా ఉందని కెలికితే తల కొరికేస్తది’ అంటున్నారు నందమూరి బాలకృష్ణ. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘జైసింహా’. ఆ సినిమా టీజర్‌ను చిత్రబృందం గురువారం విడుదల చేసింది. తన మార్కు మాస్‌ డైలాగుతో బాలకృష్ణ అలరించారు. మాసీ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌తో హైవోల్టేజ్‌ యాక్షన్‌ సీన్స్‌తో టీజర్‌ను రూపొందించారు. కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సి.కల్యాణ్‌ నిర్మిస్తున్నారు. నయనతార, హరిప్రియ, నటాషా దోషి ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. సంక్రాంతికి ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ముందుకు తీసుకొచ్చేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.