ఆ హీరో ఇప్పుడలా మారిపోయాడు!

0బొద్దుగా.. ముఖాన్ని కప్పేసిన గడ్డం.. చూసినంతనే కాదు.. పరికించి చూసినా.. గుర్తు పట్టలేని రీతిలో మారిపోయాడు రోహిత్. ఎవరీ రోహిత్ అంటారా? 6టీన్స్.. నవ వసంతం.. సొంతం.. జానకీ వెడ్స్ శ్రీరామ్ లాంటి పలు చిత్రాల్లో హీరోగా నటించిన బక్కపల్చటి రోహిత్ గుర్తుకు వచ్చాడా?

అతగాడి గురించిన ముచ్చటే ఇప్పుడు చెబుతున్నది. ఫిఫ్టీ క్రాస్ అయినా థర్టీ లో ఉన్నట్లుండా కనిపించే హీరోలకు భిన్నంగా రోహిత్ తయారయ్యాడు. యూత్ హీరోగా.. అమ్మాయిల మనసుల్ని దోచేసిన ఈ సాఫ్ట్ లుక్ కుర్రాడు ఇప్పుడు గుర్తు పట్టలేనంతగా మారిపోయాడు. వయసు పెరుగుతున్న కొద్దీ ఫిట్ నెస్ మీద ఫోకస్ చేసే సినీ జీవులకు భిన్నంగా మారాడు.

లావుగా.. గడ్డం పెంచుకొని ఏ మాత్రం గుర్తు పట్టలేనట్లుగా మారాడు. కొంతకాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న అతగాడు తాజాగా ఒక ఫంక్షన్ కు వచ్చారు. ఒకప్పటి ఈ యూత్ హీరోను ఎవరూ పట్టించుకోలేదు. ఆ మాటకు వస్తే గుర్తు పట్టలేదు కూడా. మారిన రూపం.. అతడ్ని గుర్తు పట్టలేని రీతిలో తయారు చేసింది. సినిమాల్లో కనిపించకుండా పోయిన ఇతగాడు ఇప్పుడు వ్యాపార రంగంలో ఫుల్ బిజీగా ఉన్నట్లు చెబుతున్నారు.