‘జనసేన’ ఆవిర్భావ సభ ఖర్చు ఎంతో తెలుసా?

0Janasena-Expensesపవన్‌ కళ్యాణ్‌ తాజాగా ప్రారంభించిన ‘జనసేన’ పార్టీ ఆవిర్భావ సభకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేసిన విషయం తెల్సిందే. ఈ సభకు నిధులు ఎక్కడి నుండి వచ్చాయో తేల్చాలి అని న్యాయవాది బద్దం నరసింహా రెడ్డి ఎన్నికల కమీషన్‌ను కోరాడు. పవన్‌కు ఆ నిధులు ఎక్కడి నుండి వచ్చాయో, నిధులు సమకూర్చిన వారు ఆ డబ్బును ఎలా సంపాదించారు అనే విషయంపై విచారణ జరిపించాలని నరసింహ రెడ్డి ఫిర్యాదు చేశాడు. ఈయన అంచనా ప్రకారం ‘జనసేన’ పార్టీ ఆవిర్భావ సభకు దాదాపు 250 కోట్లు ఖర్చు అయినట్లు చెబుతున్నాడు.

ఈ సభ నిర్వహణ, అభిమానుల తరలింపు పక్రియ, పలు పట్టణాలలో పెద్ద స్క్రీన్స్‌పై ప్రత్యక్ష ప్రసారం, అలాగే ప్రతి చానెల్‌లో లైవ్‌ టెలికాస్ట్‌ చేసేందుకు టీవీ చానెల్స్‌కు ఇచ్చిన అమౌంట్‌ మొత్తం కలిసి 250 కోట్లు అయి ఉంటాయి అని నరసింహా రెడ్డి లెక్కలు చెబుతున్నాడు. ఈ డబ్బుకు లెక్కలు చెప్పాల్సిన బాధ్యత పవన్‌కు ఉంది, బయటకు తీయాల్సిన బాధ్యత ఎన్నికల కమీషన్‌కు ఉంది అని ఈయన అన్నాడు. అయితే కాంగ్రెస్‌ పార్టీ నాయకులు నరసింహా రెడ్డితో ఈ ఫిర్యాదు చేయించారు అనే వాధనను పవన్‌ అభిమానులు లేవనెత్తుతున్నారు. ఏది ఏమైనా పవన్‌ తన సభ ఖర్చును బయట పెడితే బాగుంటుందని అంతా భావిస్తున్నారు.