మొగల్ ప్రిన్సెస్

0ఆమాయకంగ చూడకలా..
వేడుకలా చిలిపి కల..
అయోమయంగ వెయ్యకలా హాయి వల
నీ మీదకొచ్చి ఉరితాడై వాలదుగా..
వాలు జడ దానొంక చూస్తే ……
సుడిగాలై వస్తా సూటిగా ఎడబాటే బాటై రానా నీదాకా…
పడి లేచే కెరటం తీరుగా దిశలన్నీ దాటే హోరుగా నిను తాకే దాకా …

ఈ తెలుగు లిరిక్ లోని ఎమోషన్ లా .. జాన్వీని చూడగానే ఎమోషన్కి గురవ్వని కుర్రాడు ఉంటాడంటారా? ఇన్నాళ్లు ఫ్యాషనిస్టా అంటే సోనమ్ పేరు మాత్రమే వినిపించేది. ఇప్పుడు సోనమ్ పెళ్లాడి ఓ ఇంటిదైంది కాబట్టి ఆ ప్లేస్ ని రీప్లేస్ చేసేందుకు మరో కపూర్ గాళ్ జాన్వీ బరిలో దిగిపోయిందా? అనిపిస్తోంది. జాన్వీ ఈ లుక్ లో మత్తు కళ్లతో మహత్తు అంటే ఏంటో చూపిస్తోంది. అల్ట్రా మోడ్రన్ లుక్ తో చంపేస్తోంది.

అందుకు తగ్గట్టే ప్రఖ్యాత గ్రజియా మ్యాగజైన్ కవర్ స్టోరీని ప్రచురించింది. `జాన్వీకపూర్ గర్ల్ రైజింగ్` పేరుతో ప్రత్యేక కథనం అందించింది. సెప్టెంబర్ కవర్ పేజీపై జాన్వీ స్టిల్ చూడగానే మంత్రముగ్ధం చేస్తోంది. ధడక్ చిత్రంతో బ్లాక్ బస్టర్ ఎంట్రీ ఇచ్చి మరోసారి కరణ్ జోహార్ నిర్మాణంలోనే పీరియాడికల్ డ్రామా `తఖ్త్`లో నటించేందుకు రెడీ అవుతోంది. ఈ చిత్రంలో రణవీర్ సింగ్ – విక్కీ కౌశల్ – కరీనాకపూర్ – అనీల్ కపూర్ – ఆలియా భట్ – భూమి పెడ్నేకర్ వంటి స్టార్లు నటిస్తున్నారు. అంతమంది స్టార్ల మధ్య జాన్వీ గ్లింప్స్ ఏ తీరుగా ఉంటాయోనన్న ఆసక్తి నెలకొంది. తఖ్త్ 2020లో రిలీజ్ కానున్న భారీ చిత్రమని చెబుతున్నారు. మొగలుల సామ్రాజ్యం – రాజుల కథ నేపథ్యంలో భారీ వారియర్ కథాంశమిదని ఇప్పటికే హింట్ ఇచ్చాడు కరణ్.