జయ జానకి నాయక: క్యాథరిన్ ఐటం సాంగ్

0బోయపాటి శ్రీను దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తెరకెక్కుతున్న ‘జయ జానకి నాయక’ సినిమా కోసం హీరోయిన్ క్యాథరిన్ ఐటం గర్ల్‌గా మారింది. ‘ఎ ఫర్ యాపిల్ బి ఫ్ బుజ్జులు’ అంటూ సాంగే ఈ సాంగులో క్యాథరిన్ యమ హాటుగా కనిపించింది.

సోమవారం సాయంత్రం ‘జయ జానకి నాయక’ ఆడియో రిలీజ్ జరిగింది. ఇదే సమయంలో చిత్ర ట్రైలర్ తో పాటు, ఐటం సాంగ్ టీజర్ కూడా రిలీజ్ చేశారు. ఈ టీజర్ రిలీజ్ చేయడం ద్వారా క్యాథరిన్ హాట్ అండ్ సెక్సీ అందాలు చూపించి మాస్ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది.

హీరోయిన్‌గా సినిమాలు చేసుకుంటున్న క్యాథరిన్ ఈ సినిమాలో ఐటం సాంగ్ చేయడానికి కారణం….. భారీగా రెమ్యూనరేషన్ ఆఫర్ చేయడమే అని తెలుస్తోంది. గతంలో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ‘అల్లు శ్రీను’ సినిమాలో కూడా తమన్నాకు భారీ రెమ్యూనేషన్ ిప్పించి ఐటం సాంగ్ చేయించిన సంగతి తెలిసిందే.

ఇంతకు ముందు బోయపాటి దర్శకత్వంలో వచ్చిన ‘సరైనోడు’ మూవీలో క్యాథరిన్ హీరోయిన్‌గా నటించింది. తన కోసం ‘జయ జానకి నాయక’ సినిమాలో ఐటం సాంగ్ చేయాలని, నీ కెరీర్‌కు ఎలాంటి ఇబ్బంది లేకుండా నేను చూసుకుంటాను, నా తర్వాత సినిమాల్లో అవకాశం ఇప్పిస్తాను, ఈ సినిమాకు భారీగా రెమ్యూనరేషన్ ఇప్పిస్తాను అని బోయపాటి ఆమెను కన్విన్స్ చేసినట్లు టాక్.

నిర్మాతలతో మాట్లాడి కేథరిన్‌కు భారీగా రెమ్యూనరేషన్ ఇప్పించిన బోయపాటి…. ఐటం సాంగులో ఆమెను ఎంత హాటుగా చూపించాలో అంత హాటుగా చూపించారు. దేవిశ్రీ ప్రసాద్ అదిరిపోయేలా మాస్ బీట్స్ దట్టించి ఈ సాంగును కంపోజ్ చేశారు.

బోయపాటి శ్రీను దర్శకత్వంలో యువ కథానాయకుడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం `జ‌య‌జాన‌కినాయ‌క‌`. దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుద‌ల కార్య‌క్ర‌మం సోమ‌వారం హైదరాబాద్‌లో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో వి.వి.వినాయ‌క్‌, బోయ‌పాటి శ్రీను, జ‌గ‌ప‌తిబాబు, మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి, బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్, శ‌ర‌త్‌కుమార్‌, వాణీ విశ్వ‌నాథ్‌, రైట‌ర్ ర‌త్నం, సినిమాటోగ్రాప‌ర్ రిషి పంజాబీ, దేవిశ్రీప్ర‌సాద్‌, సాహిసురేష్‌, ప్రేమ్ ర‌క్షిత్‌, కోట‌గిరి వెంక‌టేశ్వ‌ర‌రావు, త‌రుణ్ అరోరా త‌దిత‌రులు పాల్గొన్నారు.