జయ జానకి నాయక కొత్త టీజర్‌

0తన మార్క్‌ యాక్షన్‌ను పక్కనబెట్టి ‘జయ జానకి నాయక’ సినిమా మొదటి టీజర్‌ను విడుదల చేసిన దర్శకుడు బోయపాటి.. చిత్ర రెండో టీజర్‌ను విడుదల చేశారు. బెల్లంకొండ శ్రీనివాస్, రకుల్‌ ప్రీత్‌లు హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా రెండో టీజర్‌లో సెంటిమెంటల్‌ డైలాగ్‌తో శ్రీనివాస్‌ ఆకట్టుకున్నారు.

‘లైఫ్‌లో కష్టం వచ్చిన ప్రతీసారి అన్నీ వదులుకోం. కానీ ప్రేమను మాత్రం వదిలేస్తాం. నేను వదలను. ఎందుకంటే నేను ప్రేమించా’ అనే డైలాగ్‌ గుండె బరువెక్కిస్తోంది. తానెంతగానో ప్రేమించిన అమ్మాయి కోసం బెల్లంకొండ శ్రీనివాస్‌ ఫైట్‌ చేయడం తనచెయ్యి పట్టుకుని ‘నేను వదలను..’ అని చెప్పడం హైలైట్‌గా నిలిచాయి. ఈ సినిమాలో ప్రగ్యా జైశ్వాల్‌, ఆది పినిశెట్టి, జగపతి బాబు తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ద్వారకా క్రియేషన్స్‌ బ్యానర్‌పై ఎం.రవీందర్‌ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం సమకూరుస్తున్నారు. వచ్చే నెల 11వ తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.