జయసుధ, నితిన్ ల లైఫ్ స్టోరీ

0jayasudhafamilyతెలుగునాట పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు జయసుధ. ఆమె అందరికి సుపరిచితమైనప్పటికి.. జయసుధ జీవితానికి సంబంధించిన విషయాలు చాలామందికి తెలియవనే చెప్పాలి. తెలుగమ్మాయి అయిన జయసుధకు అక్కడెక్కడో ముంబయిలో ఉండే నితిన్ ఎలా పరిచయం అయ్యారు? వారి మధ్య పెళ్లి ఎలా జరిగింది?వారిని దగ్గరకు చేసిన అంశాలేమిటి? లాంటి ప్రశ్నలకు సమాధానాలువెతికితే ఆసక్తికర అంశాలు బయటకు వస్తాయి.

జయసుధ తల్లి ఒక చిన్న నటి. తండ్రికి సినిమాలతో ఏ మాత్రం సంబంధం లేదు. అయితే.. సీనియర్ నటి విజయనిర్మల బంధువే జయసుధ. మేనత్తే వరసయ్యే విజయనిర్మల.. జయసుధ తండ్రిని ఒప్పించి సినిమాల్లోకి తీసుకొచ్చారు. నిజానికి జయసుధ అసలు పేరు సుజాత. అప్పటికే ఇండస్ట్రీలో సుజాత పేరుతో ఒకరు ఉండటంతో ఆమె పేరును జయసుధగా మార్చేశారు ప్రముఖ దర్శకులు కె.బాలచందర్.

ఇక.. జయసుధ వ్యక్తిగత విషయానికి వస్తే.. ఆమెకు ఏపీ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు బంధువైన రాజేంద్ర ప్రసాద్ తో పెళ్లి జరిగింది.కానీ.. తర్వాతి కాలంలో వారి మధ్య చోటు చేసుకున్న విభేదాలతో వివాహ బంధాన్ని తెంచేసుకున్నారు. విడాకులు తీసుకున్న కొన్నాళ్లకు పంజాబీ ఫిలిం నిర్మత నితిన్ కపూర్ తో ప్రేమలో పడ్డారు.

1985లో విద్దరి మధ్య వివాహం జరిగింది. ఇంతకీ నితిన్ తో జయసుద పరిచయం ఎలా జరిగిందన్న విషయానికి వస్తే.. అప్పట్లో తెలుగు సినిమాల్నిమద్రాస్ లో తీసిన విషయం తెలిసిందే. అప్పట్లో దర్శకరత్న దాసరి నారాయణరావు తెలుగు..తమిళ్.. హిందీ సినిమాలు చేసేవారు. ఆయన తీసిన హిందీ సినిమాల్లో హీరోగా జితేంద్ర వ్యవహరించే వారు. ఆయన కజినే నితిన్ కపూర్.

మద్రాస్ లో వ్యవహారాలు చూసుకోవాలంటూ నితిన్ కు జితేంద్ర బాధ్యతలు అప్పగించటం.. పనులు చూసుకోవటానికి వీలుగా ఇంటిని తీసుకోవటం.. ఆ ఇంటి పక్కన జయసుద ఉండేవారు. మొదట పరిచయం తర్వాత.. వారి మధ్య అనుబంధం అంతకంతకూ పెరిగింది.దీనికితోడు ఇరువురి అభిరుచులు దగ్గరగా ఉండటంతో చాలా త్వరగా సన్నిహితులయ్యారు. ఇరువురికి క్రికెట్.. కామన్ టాపిక్ కావటం..అభిరుచులు కలవటంతో వారి మద్య బంధం మరింత పెరటమే కాదు.. చివరకు పెళ్లి చేసుకున్నారు.తొలిసారి నితిన్ ను చూసినప్పుడే అభిమానం కలిగందని.. ఆయనతో ఎప్పటికి కలిసి ఉండాలన్న భావన ఉండటం.. అలాంటి భావనే జయసుదకూ ఉండటంతో వారిద్దరి తర్వాతి కాలంలో లైఫ్ పార్టనర్స్ గా మారిపోయారని చెప్పాలి.