జయసుధ రౌడీ రంగీలా !

0Mohan-Babu-and-Jayasudha-rowdyరామ్ గోపాల్ వర్మ కెరీర్ లో ‘రంగీలా’ ఓ ట్రెండ్ సెట్ మూవీ. ఈ చిత్రంతోనే వర్మ బాలీవుడ్ లో జెండా ఎగురవేశాడు. ఈ చిత్రం అన్ని విభాగాల్లో హైలెట్ గా నిలిచింది. ముఖ్యంగా  ఏ అర్ రెహ్మాన్ అదించిన మ్యూజిక్. ఈ చిత్రంలో టైటిల్ సాంగ్ ఇప్పటికి వినిపిస్తూ వుంటుంది. రమ్ రమ్ రంగీలా అంటూ సాగే ఈ సాంగ్ వర్మ ఫేవరేట్ నెంబర్స్ లో  ఒకటి. ఇప్పుడు తన  ఫేవరేట్ ‘రంగీలా’ ను  తాజా చిత్రం రౌడీ లో రీమిక్స్ చేసాడట. మరో విశేషం ఏమిటంటే.. ఈ పాటను మోహన్ బాబు, జయసుధలపై షూట్ చేశారట.

రంగీలా గా జయసుధ తనదైన స్టైల్ లో స్టెప్స్ వేసి  ఆకట్టుకొందట. ఈ సాంగ్ అవుట్ పుట్ పై యూనిట్ మొత్తం ఫుల్ ఖుషిగా వున్నారు. 20ఏళ్ళ క్రితం సంచలనం సృటించిన ఈ పాట, ఇప్పుడేలా  ఆకట్టుకుంటుందో చూడాలి. మర్చి మొదటి వారంలో ఈ చిత్రంను రిలీజ్ చేయడానికి సన్నహాలు చేస్తున్నారు.