జయసూర్యపై భార్య విడాకుల పిటిషన్

0sanat-jaya-surya-wifeహైదరాబాద్: శ్రీలంక మాజీ కెప్టెన్, ప్రస్తుత క్రికెట్ సెలక్షన్ ప్యానల్ ఛైర్మన్ సనత్ జయసూర్య భార్య సండ్రా జయసూర్య కొలంబో జిల్లా కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేసింది. ఈ విషయాన్ని ఆమె న్యాయవాది అనోమా గునథిలకే శుక్రవారంనాడు తెలిపారు. అక్టోబర్ 23న దాఖలైన పిటిషన్ మేరకు త్వరలోనే కోర్టు నుంచి జయసూర్యకు నోటీసులు జారీ చేస్తారని చెప్పారు. అయితే, తన ముగ్గురు పిల్లల జీవనంకోసం 20 మిలియన్లు ఇప్పించాలని కోరినట్లు న్యాయవాది తెలిపారు.
లంక ఎయిర్ లైన్స్ లో పనిచేసిన సండ్రా తానియా రోస్ మేరి డి సిల్వా జయసూర్యకు రెండవ భార్య. 1998లో సుముదు కారుణ్యకే అనే మహిళను వివాహం చేసుకున్న సూర్య గతంలోనే విడిపోయారు. శ్రీలంక అధ్యక్షుడు మహీందా రాజపక్ష ప్రభుత్వంలో జయసూర్య డిప్యూటీ మంత్రిగా కూడా ఉన్నారు. మతారా దక్షిణ జిల్లా నుంచి 2010 ఏప్రిల్‌లో జరిగిన ఎన్నికల్లో పార్లమెంటుకు ఎన్నికయ్యారు. జయసూర్య శ్రీలంక జాతీయ జట్టుకు కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు. బ్యాటింగులోనే కాకుండా స్పిన్ బౌలింగులో శ్రీలంక జట్టుకు అతను ఒకప్పుడు అతి ముఖ్యమైన ఆటగాడిగా ముందుకు వచ్చాడు.
Tags : sanath jayasuriya, cricket, sri lanka, సనత్ జయసూర్య, క్రికెట్, శ్రీలంక, జయసూర్యపై భార్య విడాకుల పిటిషన్