విశాఖ ఎయిర్ పోర్టులో రెచ్చిపోయిన జేసీ

0


jc-diwakar-reddyటీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి చిర్రెత్తిపోయారు. విమానశ్రయంలో అధికారులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆలస్యంగా విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకున్న ఆయన.. బోర్డింగ్ పాస్ ఇవ్వలేదన్న కోపంతో అధికారులతో వాగ్వాదానికి దిగారు. సమయం మించిపోయిందని చెప్పినా వినకుండా ఆగ్రహంతో ఊగిపోయారు.

గురువారం ఉదయం ఆయన విశాఖ నుంచి హైదరాబాద్ వెళ్లాల్సి ఉండగా.. బోర్డింగ్ సమయం కంటే ఆలస్యంగా ఎయిర్ పోర్టుకు వచ్చారు. దీంతో అధికారులు పాస్ ఇవ్వడానికి అంగీకరించలేదు. అధికారుల సమాధానానికి తీవ్ర ఆగ్రహానికి లోనైన జేసీ.. బోర్డింగ్ పాస్ ప్రింటర్ ను విసిరేసి రచ్చ రచ్చ చేశారు.

జేసీ నిర్వాకంపై విశాఖ ఎయిర్ పోర్టు సిబ్బంది ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. గతంలోను గన్నవరం ఎయిర్ పోర్టు సిబ్బంది పట్ల జేసీ దురుసుగా ప్రవర్తించారు. కాగా, గతంలో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఎయిర్ పోర్టు అధికారుల పట్ల దురుసుగా ప్రవర్తించారని ఆయన్ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. మరి ఇప్పుడు విశాఖ ఎయిర్ పోర్టులో జేసీ చేసిన హంగామాకు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.