బాబు అవినీతి … జేడీ లక్ష్మీనారాయణ

0సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ మహారాష్ట్ర క్యాడర్ లో కొనసాగుతూ ఇటీవల స్వచ్చంద పదవీ విరమణ చేశారు. ఆయన రాజకీయాల్లోకి వస్తారని ఊహాగానాలు వచ్చాయి. అది జనసేన పార్టీనా ? బీజేపీనా అన్నది ఇంతవరకు క్లారిటీ రాలేదు. అయితే కొద్ది రోజుల క్రితం ఆర్ ఎస్ ఎస్ కార్యక్రమంలో పాల్గొని బీజేపీలో చేరతాను అన్న సంకేతాలు ఇచ్చారు. ఇక 2019 బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి అని కూడా ఓ ప్రచారం కొనసాగుతుంది. అంత ఛరీష్మా ఆయనకు లేదన్నది అందరికీ తెలిసిందే. ఆ విషయాలు పక్కన పెడితే రేపో మాపో రాజకీయ అరంగేట్రానికి సిద్దంగా జేడీ లక్ష్మీ నారాయణ మెల్లగా రాజకీయ విమర్శలకు తెరలేపుతున్నాడు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాల అమలులో భారీ అవినీతి చోటుచేసుకుంటున్నట్లు తన దృష్టికి వచ్చిందని మహారాష్ట్రలో పనిచేస్తున్నా ఆంధ్రా పరిస్థితుల మీదనే ఆసక్తి అని ఓ ఆంగ్ల పత్రికతో జేడీ తన అనుభవాలు పంచుకున్నారు. నాలుగు జిల్లాలు తిరిగిన నేను ఐదో జిల్లాగా విజయనగరం జిల్లాకు వెళ్లానని – అంతటా అవినీతి పెద్ద ఎత్తున ఉందని తన పరిశీలనలో వెల్లడయిందని ఆయన అన్నారు.

మహారాష్ట్రలో మంచి క్యాడర్ కు వెళ్లే అవకాశాలున్నా తన కుమారుడికి సివిల్స్ లో 196వ ర్యాంకు రావడంతో మెల్లగా లక్ష్మీనారాయణ రాజకీయాల వైపు దృష్టి మళ్లించాడని చెబుతున్నారు. అయితే పదవిలో ఉన్నప్పుడు – దర్యాప్తు చేయాల్సినప్పుడు బాబు అవినీతి గురించి పట్టించుకోని జేడీకి ఇప్పుడు ఆంధ్రాలో తిరిగితే గానీ తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నాడని .. ఇప్పటికయినా ఆంధ్రాలో అవినీతి పాలన గురించి మాట్లాడాలని అంటున్నారు.