50 ఏళ్ల వయసులో టాప్ లెస్ గా ఫోటో షూట్!

0

జీవితంలో వయసు జస్ట్ ఒక అంకె మాత్రమే. అది మనసుకు ఏ మాత్రం సంబంధం లేదని చెప్పటమే కాదు.. చేతల్లో చేసి చూపిస్తున్నారు హాలీవుడ్ టాప్ నటి జెన్నిఫర్ ఆనిస్టన్. యాభై ఏళ్ల ఈ సుందరి తాజాగా చేసిన టాప్ లెస్ ఫోటో షూట్ ఇప్పుడు సంచలనంగా మారటమే కాదు.. హాట్ హాట్ గా మారింది.

ఒక అంతర్జాతీయ మ్యాగ్ జైన్ కోసం చేసిన ఈ ఫోటో షూట్ ఇప్పుడు వైరల్ గా మారటమే కాదు.. జెన్నీఫర్ మీద ఒక లుక్ వేసేలా చేసింది. ప్రముఖ మ్యాగ్ జైన్ హార్పర్ బజార్ కోసం రానున్న రెండు నెలలు (జూన్.. జులై) జెన్సిఫర్ అనిస్టన్ తన ఫోటో షూట్ తో సంచలనాన్ని సృష్టిస్తున్నారు. ఆమె ఫోటో షూట్ అభిమానులకు కిర్రెక్కిస్తోంది.

నా అందాలతో వేడుక చేసుకోవటం నాకు చాలా ఇష్టమనే జెన్నీఫర్.. షూట్ కోసం ప్రత్యేక దుస్తుల్ని డిజైన్ చేశారు. టాప్ లేకుండా తన చేతుల్ని అడ్డుగా పెట్టుకొని గ్లామరస్ గా ఫోజ్ ఇచ్చిన ఫోటో ఇప్పుడు సంచలనంగా మారింది. నా పైభాగం ఎవరినైనా రెచ్చగొట్టేలా ఉందని భావిస్తే తప్ప ఎవరికి ఎలాంటి హానీ ఉందన్న ఆమె.. ఇటీవల యాభయ్యో జన్మదినోత్సవాన్ని జరుపుకున్నారు.

ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ఆ వేడుకకు పలువురు హాలీవుడ్ నటులు పాల్గొన్నారు. ఈ పార్టీకి ఆమె మాజీ భర్త బ్రాడ్ పిట్ హాజరు కావటం ఒక ఎత్తు అయితే.. ఇటీవలే ఎంజెలీనా జోలీతో విడాకులు తీసుకున్న అతగాడు.. జెన్నీఫర్ కు దగ్గరవుతున్నట్లు చెబుతున్నారు. ఏ అవకాశమైనా తలుపు తడితే.. దాన్ని స్వాగతించటం తనకు అలవాటుగా చెప్పుకున్న ఆమె.. తన దగ్గరకు వచ్చే ఆఫర్లను రిజెక్ట్ చేయటం తనకు ఇష్టం ఉందన్నారు.

ప్రస్తుతం తానేం చేస్తున్నాను? ఎలా సంతృప్తి లభిస్తుందన్న దానికే తన ప్రాధాన్యత అని చెప్పిన ఆమె.. హాలీవుడ్ లో ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ రూపొందిస్తున్న మర్డర్ మిస్టరీ సినిమాలో జెన్నీఫర్ ఆనిస్టన్ నటిస్తున్నారు.
Please Read Disclaimer