జెర్సీ కోరుకుంది దక్కిందా ? – ఫస్ట్ వీక్ కలెక్షన్

0

న్యాచురల్ స్టార్ నాని జెర్సీ రెండో వారంలోకి అడుగు పెట్టింది. ఈ ఏడాదిలో అవుట్ రైట్ గా పాజిటివ్ టాక్ వచ్చిన మూవీగా జెర్సీనే ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన ఎఫ్2కి సైతం మొదట్లో కొన్ని నెగటివ్ రిమార్క్స్ వచ్చాయి కానీ జెర్సీకి మాత్రం అందరూ యునానిమస్ గా ఒకే మాట అన్నారు. ఈ లెక్కన బ్లాక్ బస్టర్ స్థాయిలో ఉండాలి వసూళ్లు.

కానీ పరిస్థితి మాత్రం దానికి కొంత భిన్నంగా చూపుతూ జెర్సీ ఫస్ట్ వీక్ కంప్లీట్ చేసుకుంది. ఇప్పటిదాకా 22 కోట్ల షేర్ తెచ్చి సేఫ్ వెంచర్ అనిపించుకునే దిశగా అడుగులు వేస్తోంది . జరిగిన ధియేట్రికల్ బిజినెస్ 26 కోట్లు. ఇంకో 4 కోట్లు వస్తే నష్టాల బారిన పడకుండా జెర్సీ హిట్ ముద్రతో బయట పడుతుంది. కాని వాస్తవానికి ట్రేడ్ ఆశించింది ఇది కాదు

వచ్చిన టాక్ కి మొదటి వారం దాటకుండానే పెట్టుబడి మొత్తం వెనక్కు వచ్చి ఉండాలి. ఇప్పుడు బాలన్స్ ఉన్న నాలుగు కోట్లు ఒక్క రోజులో రావు. వీకెండ్ సహాయంతో రాబట్టుకున్నా ఆ తర్వాత వచ్చేదే లాభం కిందకు వస్తుంది. ఒకపక్క అవెంజర్స్ ఎండ్ గేమ్ ప్రభంజనం మరోవైపు ఊహించని విధంగా కాంచన 3 నెగటివ్ టాక్ వచ్చినా మాస్ ప్రేక్షకుల అండతో వసూళ్లు బాగానే రాబట్టుకోవడం జెర్సీ ఫిగర్స్ మీద బాగా ప్రభావం చూపించింది.

ఒకవేళ జెర్సీకి సోలో రిలీజ్ దక్కి ఉంటె ఇప్పుడు వచ్చిన 22 కోట్లకు ఖచ్చితంగా మరో 8 లేదా పది కోట్లు తోడయ్యేవని ట్రేడ్ భావిస్తోంది. ఇప్పుడు అవెంజర్స్ మేనియాలో జెర్సీ ఈ రెండో వారం నుంచి ఎంత తెస్తుంది అనేది పెద్ద చిక్కు ప్రశ్నగా మారింది. ఎమోషన్ ఎంత బలంగా ఉన్నా అది రిపీట్ వేల్యూ గా మారలేకపోయిందని పైగా మాస్ కి కనెక్ట్ అయ్యే విధంగా సెంటిమెంట్ పండలేదనే కామెంట్స్ కి వసూళ్లు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. సో జెర్సీ ఆశించిన స్థాయిలో భారీ మొత్తాన్ని రాబట్టుకోలేకపోవడం ఆశ్చర్యపరిచే విషయమే
Please Read Disclaimer