జెర్సీని వెంటాడుతున్న దెయ్యం

0

కొన్నిసార్లు అంచనాలు టాక్ రిపోర్టులకు భిన్నంగా బాక్స్ ఆఫీస్ ఫలితాలు నమోదవుతూ ఉంటాయి. నెగటివ్ గా అందరూ కొట్టిపారేసిన సినిమాలు సూపర్ కలెక్షన్స్ రాబడితే ఆహా ఓహో అన్న మూవీస్ ఆశించిన వసూళ్లు తేలేక చప్పబడిపోతాయి. ఇప్పుడు ట్రెండ్ ను గమనిస్తే అదే అనిపిస్తోంది. న్యాచురల్ స్టార్ నాని జెర్సీకి ఏ స్థాయిలో ప్రశంశలు దక్కాయో దానికి పూర్తిగా వ్యతిరేక స్థాయిలో కాంచన 3 గురించి నెగటివ్ కామెంట్సూ వచ్చాయి.

కాని వసూళ్లు మాత్రం రెండు అటు ఇటుగా సమాన స్థాయిలో ఉండటం షాక్ ఇచ్చే అంశం. ఎక్కడో బిసి సెంటర్స్ లో ఇలా జరిగితే సహజం అనుకోవచ్చు కాని సినిమా వసూళ్ళకు ప్రామాణికంగా భావించే ఆర్టిసి క్రాస్ రోడ్స్ లో సైతం ఇవే వాస్తవాలు బయటపడటం గమనార్హం

నిన్న గురువారం. చెప్పాలంటే ఒక రకంగా డ్రై డే లాంటిది. బ్లాక్ బస్టర్ వచ్చిన సినిమాలకు తప్ప వసూళ్లు మిగిలిన వాటికి పెద్దగా ఉండవు. కాని నిన్న పరిస్థితి ఓసారి చూద్దాం. నిన్న ఉదయం మార్నింగ్ షోకి మెయిన్ ధియేటర్ సంధ్యలో జెర్సీ 30 వేల కలెక్షన్ రాబట్టగా దేవి మెయిన్ ధియేటర్ గా ఉన్న కాంచన 3 ఆశ్చర్యకరంగా 29 వేలకు చేరువలోకి వెళ్ళింది.

మ్యాట్నీ షోకి జెర్సీ అదే హాల్ లో 65 వేల కలెక్షన్ నమోదు చేయగా కాంచన 3 కేవలం మూడు వందల రూపాయల తక్కువతో అంతే మొత్తం 65 వేలు రాబట్టింది. ఇక ఫస్ట్ షో సంగతి చూస్తే జెర్సీ 44 వేలు నమోదు చేస్తే కాంచన 3 నేనేం తక్కువా అన్నట్టు 43 వేల 300 లాగేసింది. సెకండ్ షో సైతం దీనికి భిన్నంగా ఏమి లేదు. దీన్ని బట్టి కాంచన 3 లోని దెయ్యం మసాలా ప్రభావం జెర్సీ క్రికెట్ బ్యాట్ మీద ఎంత బలంగా పడిందో అర్థమవుతోంది
Please Read Disclaimer