దెయ్యం దెబ్బను నాని కాచుకుంటాడా

0

న్యాచురల్ స్టార్ నాని జెర్సీ రాఘవ లారెన్స్ కాంచన 3 ఒకే రోజు విడుదల కానున్నాయి. రెండు పూర్తి విరుద్ధమైన జానర్స్ కావడంతో పోటీ సమస్యే లేదని నాని ఫాన్స్ ధీమాగా ఉన్నారు కానీ ఇక్కడ ఓ విషయం మర్చిపోకూడదు. లారెన్స్ సైలెంట్ కిల్లర్. తీసిన కాన్సెప్ట్ నే మళ్ళి మళ్ళి తీసినా మాస్ పల్స్ కి తగ్గట్టు వాళ్ళకు ఏమేం కావాలో అవన్నీ పొందుపరిచి టికెట్ డబ్బులకు న్యాయం కలిగిందని ఫీలింగ్ వచ్చేలా చేయడంలో మంచి నేర్పరి.

కాంచన 3 ఓపెనింగ్స్ కు ఇదే కీలకంగా మారబోతోంది. ట్రైలర్ చూసాక కథ మీద ఒక అవగాహన వచ్చినప్పటికీ ఊహించని అంశాలతో ఏదో ఒకరకంగ లారెన్స్ థ్రిల్ చేయించక మానడు. ఈ నేపథ్యంలో చాలా ఎమోషనల్ కంటెంట్ తో స్పోర్ట్స్ డ్రామా బ్యాక్ డ్రాప్ లో వస్తున్న జెర్సి పైకి కనిపించినంత తేలిగ్గా కాంచన 3ని ఫేస్ చేయడం సులభం కాదు

కాంచన సిరీస్ లో రొటీన్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నా కామెడీ హారర్ యాక్షన్ వీటికి లోటు లేకుండా చూసుకుంటాడు లారెన్స్. వీటికి అదనంగా కళ్ళు చెదిరే డాన్సులు ఎలాగూ ఉండనే ఉంటాయి. పైగా కాంచన 3 కు ముందు లారెన్స్ సినిమా వచ్చి రెండేళ్లు దాటింది. శివలింగ తర్వాత మళ్ళి కనిపించని లేదు.

సో కాంచన 3కు ఇదంతా ఫెవర్ గా మారుతుంది. కెరీర్ లో ఓడిపోయి కొడుకు కోసం క్రికెట్ బ్యాట్ పట్టుకునే మిడిల్ ఏజ్ పాత్రలో నాని చేసే సెంటిమెంట్ డ్రామా కన్నా హోరెత్తిపోయే యాక్షన్ హారర్ తో మసాలా అంశాలతో లారెన్స్ పెట్టే దెయ్యం కేకల వైపే మాస్ వర్గాలు మొగ్గు చూపే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కాంచన 3 టాక్ ఏ మాత్రం పాజిటివ్ గా వచ్చినా జెర్సి తన బ్యాటుతో పెద్ద యుద్ధమే చేయాల్సి ఉంటుంది




Please Read Disclaimer