శ్రీదేవి కూతురు మొదలుపెట్టింది..

0అతిలోకసుందరి శ్రీదేవి మరణించిందని వార్త ఇంకా నమ్మలేకపోతున్నాం..ఈమె చనిపోయి రెండు వారాలు కావొస్తున్నా ప్రేక్షకులు మాత్రం ఇంకా ఆమె మరణాన్ని గురించి మాట్లాడుకుంటూనే ఉన్నారు. ఇక తాజాగా ఆమె కూతురు జాన్వీ క‌పూర్ తన మొదటి సినిమా ద‌ఢ‌క్ షూటింగ్ లో పాల్గొంది. మ‌రాఠీ చిత్రం సైర‌త్‌కి రీమేక్‌గా ఈ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెల్సిందే.

ఇషాన్ ఖ‌ట్ట‌ర్ హీరో గా నటిస్తున్న ఈ మూవీ జూలై 20న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. త‌ల్లి మ‌ర‌ణం త‌ర్వాత కొద్ది రోజులు షూటింగ్‌కి దూరంగా ఉన్న జాన్వీ ఆ విషాదం నుండి కాస్త తేరుకొని తిరిగి షూటింగ్‌లో పాల్గొంది. బాంద్రా కార్ట‌ర్ రోడ్‌లో జాన్వీ, ఇషాన్ ఖ‌ట్ట‌ర్‌ల‌పై ప‌లు సన్నివేశాలు చిత్రీక‌రించాడు ద‌ర్శ‌కుడు శ‌శాంక్ ఖైతాన్‌.