వేడి పుట్టిస్తున్న జాహ్నవి

0శ్రీదేవి కూతురు జాహ్నవి ఎంట్రీ అదిరిపోయింది. ఆమె పరిచయమైన ధడక్ సంచలన విజయం దిశగా దూసుకెళుతోంది. బాక్సాఫీసు దగ్గర వసూళ్లు హోరెత్తిపోయాయి. దాంతో బాలీవుడ్ లో జాహ్నవి తొలి చిత్రానికే సూపర్ స్టార్ రేంజ్ క్రేజ్ సంపాదించుకొంది. ప్రస్తుతం పలువురు దర్శకనిర్మాతలు ఆమె కోసం క్యూలో ఉన్నారు. సినిమా సక్సెస్ తో కవర్ పేజీల్లో జాహ్నవి వెలిగిపోతోంది.

తన కోస్టార్ ఇషాన్ తో కలిసి ఫిల్మ్ ఫేర్ లేటెస్ట్ ఎడిషన్ కవర్ పేజీపై జాహ్నవి హొయలుపోయిన విధానం కుర్రాళ్లల్లో వేడి పుట్టించేలా ఉంది. సహజంగానే హాట్ గా కనిపించే జాహ్నవి ఈ కవర్ పేజీలో మరింత రెచ్చగొట్టేలా కనిపిస్తోంది. ఆమె వేసిన ప్యాంట్ నాభి కిందకి జారింది. జాహ్నవి తాను ఎలాంటి పాత్రల్లోనైనా ఒదిగిపోగలనని చాటి చెప్పే ప్రయత్నంలో భాగంగానే ఆమె ఇలాంటి హాట్ ఫొటోషూట్ లతో అదరగొడుతోందని తెలుస్తోంది.