జాన్వీ ధడఖ్ పోస్టర్ కలర్ఫుల్!!

0మొదటి సినిమా ఇంకా తెరపైకి రాకముందే శ్రీదేవి కూతురు జాన్వీ మంచి క్రేజ్ ఆందుకుంటోంది. సోషల్ మిడియలో ఆమె ఫొటోలు ఈ మధ్య తెగ వైరల్ అవుతున్నాయి. శ్రీదేవి అంత కాకపోయినా తనదైన శైలిలో అభిమానులను సంపాదించుకుంటోంది ఈ బ్యూటీ. ఇటీవల ఓ జిమ్ నుంచి బయటకు వస్తుంటే చిన్నా పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు జాన్వీ ని చూసి ఎగబడ్డారు.

ఇక అమ్మడు మొదటి సినిమా ధడఖ్ సినిమా మొదలై నెలలు గడుస్తోంది. షూటింగ్ కూడా ఎండింగ్ కి వచ్చేసింది. దీంతో చిత్ర యూనిట్ పోస్టర్స్ తో అడ్వాన్స్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది. కథానాయకుడు ఈషన్ ఖాతార్ ఆయినా కూడా మెయిన్ గా జాన్వీ ని ఫోకస్ చేసి పోస్టర్స్ రిలీజ్ చేస్తున్నారు. రీసెంట్ గా రిలీజ్ చేసిన పోస్టర్ లో కూడా జాన్వీ కలర్ఫుల్ గా కనిపిస్తోంది.

ఈషన్ ఆమె మొహంపై రంగు పూస్తుండగా మెల్లగా తల పక్కకు తిప్పుకొని సిగ్గుపడుతూ.. ఉండడం కొత్తగా అనిపిస్తోంది. చూస్తుంటే ఈ బ్యూటీ స్టార్ హీరోయిన్ అవ్వడం పక్కా అని అర్ధమవుతుంది. ఇక మరాఠీ సినిమా సైరత్ కు దడఖ్ రీమేక్ గా వస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే నెల 20న సినిమా విడుదల కానుంది.