హాట్ టాపిక్: పాప జిమ్ము డ్రెస్సులు!

0

స్టార్ కిడ్స్ గా ఉండడం అంటే ఎంతో అదృష్టం అనుకుంటారు కానీ వారికి కొన్నిరకాల కష్టాలు ఉంటాయి. లోకులు.. కొందరు సెలబ్రిటీ కాకులు వారిని నెపోటిజం అని కరణ్ జోహరిజం అంటూ ఎత్తిపొడుస్తూ ఉంటారు. ఇక ఆగోల అలా ఉంటే పేపరాజి గోల మరోరకంగా ఉంటుంది. ఈ స్టార్ కిడ్స్ ఎక్కడ కనిపిస్తారా అని చకోరపక్షుల్లా ముంబైలో వేచి చూస్తుంటారు. బయట అడుగుపెడితే చాలు క్లిక్కుమనిపించి సోషల్ మీడియాలో ఆ ఫోటోలను క్షణాలలో పెట్టేస్తారు. దీంతో స్టార్ కిడ్స్ ఎక్కడికి వెళ్ళినా తమ డ్రెస్సింగ్ పట్ల చాలా జాగ్రత్త వహించాల్సి వస్తుంది. జూనియర్ అతిలోకసుందరి జాన్వికి మొదటి నుంచి ఈ బాధలు తప్పడం లేదు.

జాన్వి ఎయిర్ పోర్ట్ లో కనిపిస్తే ఫోటోలు.. హోటల్ కు వెళ్తే ఫోటోలు..ఇంటినుంచి బయటకు వస్తే ఫోటోలు.. జిమ్ కు వెళ్తే ఫోటోలు.. ఆఖరుకు కారు ఎక్కినా ఫోటోలే.. దిగినా ఫోటోలే. గతంలో జాన్వి కొన్ని సందర్భాలలో క్యాజువల్ గా కనిపించేది. కానీ ఇప్పుడు ఈ కెమెరాల అటెన్షన్ కారణంగా తన డ్రెస్ విషయంలో డబల్ జాగ్రత్తలు తీసుకుంటోంది. జిమ్ కు కసరత్తుల కోసం వెళ్ళే సమయంలో కూడా కత్తిలాంటి దుస్తులు వేసుకునేందుకు ప్రాధాన్యత ఇస్తోంది. తన డ్రెసింగ్ లో మార్పు కూడా ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ టాపిక్ అయింది.

పైనున్న ఫోటోలు జిమ్ కు వెళ్తూ.. ఎక్సర్ సైజులు చేసి అలిసిపోయి బయటకు వస్తూ ఉన్నప్పుడు తీసినవే. కానీ డ్రెస్సులు చూస్తే కెవ్వుకేక అనిపించేలా ఉన్నాయి కదా? అసలు ఆ మైక్రోలు.. మినీలు చూస్తుంటే బుద్ధి ఉండేవాడెవడైనా శ్రీదేవికి జాన్వి సరైన వారసురాలని ఒప్పుకుంటాడు. జూనియర్ అతిలోక సుందరి అని జేజేలు పలుకుతాడు.
Please Read Disclaimer