రాజమౌళి మల్టీస్టారర్ లో శ్రీదేవి కూతురు?

0బాహుబలిలో శివగామి పాత్ర కోసం మొదట అతిలోక సుందరి శ్రీదేవినే సంప్రదించానని రాజమౌళి అప్పట్లో ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే ఆమె అధికంగా డిమాండ్ చేయడంతో రమ్యక్రిష్ణను ఎంచుకున్నామని వివరించాడు కానీ ఆ తర్వాత దీనిపై శ్రీదేవి అభ్యంతరం తెలుపడం.. వివాదం చెలరేగడం జరిగిపోయింది.

శ్రీదేవితో కలిసి చేయలేకపోయిన రాజమౌళి ప్రస్తుతం ఆమె కూతురు జాన్వికి అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. బాహుబలిని హిందీలో రిలీజ్ చేసిన నిర్మాత కరణ్ జోహర్ ఇటీవలే శ్రీదేవి కూతురు జాన్విని బాలీవుడ్ లో లాంచ్ చేశారు. ‘ధడక్’ పేరుతో వచ్చిన ఆ మూవీ అక్కడ హిట్ అయ్యింది. ప్రస్తుతం జాన్వీకి గాడ్ ఫాదర్ గా కరణ్ జోహర్ అవతారం ఎత్తారు. అందులో భాగంగానే రాజమౌళి త్వరలో తీయబోయే మల్టీస్టారర్ లో జాన్విని తీసుకోవాలని కరణ్ జోహర్ ఒత్తిడి తెస్తున్నట్టు ఓ వార్త ఫిలింనగర్ లో షికారు చేస్తోంది. ఈ సినిమా కోసం 100 రోజుల కాల్షీట్లు కూడా ఇచ్చేందుకు జాన్వీ రెడీ అయిపోయినట్టు తెలిసింది.

రాజమౌళి త్వరలో తీయబోయే ఎన్టీఆర్ – చరణ్ మల్టీస్టారర్ లో ఒక కథానాయికగా జాన్విని నటింప చేయాలని కరణ్ ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని హిందీతో సహా దేశంలోని చాలా భాషల్లో రిలీజ్ చేయడానికి రాజమౌళి ప్లాన్ చేస్తున్నారు. జాన్వికి దేశవ్యాప్తంగా గుర్తింపు రావాలంటే రాజమౌళి సినిమానే కరెక్ట్ అని భావిస్తున్నారు. అయితే గాసిప్పుగా వెలువడిన ఈ వార్త నిజమైతే మాత్రం శ్రీదేవి కూతురు జాన్వి దశ తిరిగినట్టే అనుకోవాలి..