శ్రీదేవికి తగ్గ కూతురే!

0

అతిలోక సుందరి శ్రీదేవి కూతురిగా ‘ధడక్’ సినిమాతో హీరోయిన్ గా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది జాన్వి కపూర్. మొదటి సినిమాలో మంచి మార్కులతోనే పాసయింది. రెండో సినిమాగా ఒక భారీ ప్రాజెక్ట్ సైన్ చేసింది. కరణ్ జోహార్ నిర్మాణంలో తెరకెక్కనున్న ఈ పీరియడ్ డ్రామా పేరు ‘తఖ్త్’. ఈ సినిమాలో కరీనా కపూర్.. రణవీర్ సింగ్.. అలియా భట్.. అనిల్ కపూర్.. భూమి పెడ్నేకర్.. విక్కీ కౌశల్ ఇతర కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ చిత్రం 2020లో రిలీజ్ అవుతుందట.

సినిమాల సంగతి పక్కనబెడితే జాన్వి ఫ్యాషన్ మ్యాగజైన్ ఫోటో షూట్ల తో ఎప్పుడూ వార్తల్లో ఉంటుంది. ఫోటో షూట్లు కవర్ పేజిపై దర్శనాలు మాత్రమే కాకుండా రీసెంట్ గా బ్రైడ్ అనే మ్యాగజైన్ కు ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్లు అడిగారు గానీ అన్నిటికంటే స్పైసీ క్వశ్చన్ మాత్రం “మీకు ఎవరిపై క్రష్ ఉంది?” మరి దీనికి సమాధానం అందరిలాగా హృతిక్ అనో.. రణబీర్ కపూర్ అనో చెప్పి గాసిప్స్ రాసే జనాలకు పండగ చేసుకునే అవకాశం ఇవ్వలేదు. తనకు క్రష్ అనేది తరచూ మారుతుందని చెప్పింది. తన మూడ్ ని బట్టి ఒక్కోసారి ఒక్కో వ్యక్తిపై క్రష్ ఏర్పడుతుందని చెప్పింది.

ఒకసారేమో మ్యాట్ డామన్ మీద.. మరోసారి గురుదత్ మీద క్రష్ కలుగుతుంది. ఒకరేమో 47 ఏళ్ళ హాలీవుడ్ స్టార్.. మరొకరు లెజెండరీ బాలీవుడ్ యాక్టర్. ఇక గాసిప్పు రాయుళ్ళు ఏం చెయ్యగలరు చెప్పండి? శ్రీదేవి కూతురా.. మజాకానా?
Please Read Disclaimer