తొలిచిత్రానికి జాన్వి రెమ్యునరేషన్ ఎంత?

0హీరో హీరోయిన్ల రెమ్యునరేషన్ అనేది ఎప్పుడూ ఓ హాట్ టాపిక్. పెద్ద సూపర్ స్టార్ ల నుండి మొదలుపెడితే డెబ్యూ సినిమా యాక్టర్ల దాకా ఎంత తీసుకుంటారో తెలుసుకోవాలనే కుతూహలం ప్రేక్షకులకు ఎప్పుడూ ఉండేదే. పైగా నటులెప్పుడూ తమ రెమ్యునరేషన్ ఇంత అంటూ ఓపెన్ గా చెప్పరు.. దీంతో కొన్ని ఊహాగానాలు కూడా సాగుతుంటాయి. ఈమధ్యనే బాలీవుడ్లో హీరోయిన్ గా అరంగేట్రం చేసిన శ్రీదేవి-బోనీ కపూర్ ల ముద్దుల కూతురు జాన్వి రెమ్యునరేషన్ పై కూడా ఇప్పుడు జోరుగా చర్చలు సాగుతున్నాయి.

ఒక్క జాన్వీ నే కాదు జాన్వి డెబ్యూ సినిమా ‘ధడక్’ కు పనిచేసిన ముఖ్యమైన నటీ నటులు టెక్నీషియన్స్ కు నిర్మాత కరణ్ జోహార్ ఎంత చెల్లించాడో ఓ బాలీవుడ్ మీడియా లో ఒక కథనం వచ్చింది. జాన్వికి – హీరో ఇషాన్ కు జోహార్ చెల్లించిన రొక్కం చెరి 60 లక్షలట. అందులో జాన్వి కి తండ్రి పాత్రలో నటించిన యాక్టర్ అశుతోష్ రాణాకు 80 లక్షల రూపాయల డబ్బు ముట్టిందట. సంగీత దర్శకుల జోడీ అజయ్-అతుల్ కు కోటిన్నర చెల్లించారట. ‘ధడక్’ సినిమాకు పనిచేసిన వాళ్ళందరిలో ఎక్కువ ఫీజు తీసుకున్నది మాత్రం దర్శకుడు శశాంక్ ఖైతాన్. అయనకు జోహార్ నాలుగు కోట్ల రూపాయలు ఇచ్చారట. మరి జోహార్ ఆయనకు మాత్రం అంత ఎక్కువ ఇవ్వడానికి ఒక కారణం ఉండాలి కదా. అదేంటంటే.. కరణ్ జోహార్ నిర్మాణ సంస్థ అయిన ధర్మ ప్రొడక్షన్ కు శశాంక్ గతంలో ‘హంప్టీ శర్మకి దుల్హనియా’.. ‘బద్రీనాథ్ కి దుల్హనియా’ సినిమాలతో రెండు కమర్షియల్ హిట్స్ అందించాడట.

ఏదో మొదటి సినిమా కాబట్టి జాన్వి అరవైలక్షలతో సరిపెట్టుకుందిగానీ రేపు స్టార్ అయిన తర్వాత వాళ్ళ నాన్న బోనీ కపూర్ ఊరుకుంటాడా?.. కరణ్ జోహార్ ముక్కు పిండీ మరీ కోట్లకు కోట్లు వసూలు చేయకుండా ఉంటాడా?