బాలీవుడ్ బ్యూటీకి ట్రోలింగ్ తప్పలేదు!

0ఈ సోషల్ మీడియా జెనరేషన్ లో ట్రోలింగ్ అనేది చాలా కామన్ అయిపోయింది. దగ్గినా.. తుమ్మినా.. తైముర్ అని పేరుపెట్టుకున్నా ట్రోలింగ్ చేస్తారు. ఇక టీ షర్టు వేసుకుని కింద బాటం లేకపోతే ట్రోలింగ్ చేయకుండా ఉంటారా? జాన్వీ కపూర్ కు రీసెంట్ గా ఈ ట్రోలింగ్ హీట్ తగలింది. స్టార్ కిడ్స్ బ్యాచ్ లో జాన్వి కపూర్ కు స్టైల్ ఐకాన్ అనే పేరుంది కానీ అప్పుడప్పుడు తనకు నచ్చినట్టు బట్టలు వేసుకుంటుంది కదా .. ఆలానే వేసుకొని బుక్కయింది.

రీసెంట్ గా ముంబై లోని జుహూ ఏరియాలో జాన్వి కనపడింది. ఇక ఆమె ఫోటోలు చకచకా తీయడం అవి ముంబై మీడియాలో ప్రత్యక్షం కావడం జరిగిపోయాయి. కానీ ఈ ఫోటోలలో జాన్వి నియాన్ పింక్ టీ షర్ట్ లో కనిపించింది. కలర్ తో పెద్ద ఇబ్బంది లేదు కానీ కాస్త ఓవర్ సైజ్ టీ షర్టు వేసుకుంది. కింద ప్యాంటు వేసుకోలేదు. దీంతో నెటిజనులు ఆమెను ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. ఒకరు “బిచారి ప్యాంట్ పెహెన్ నా భూల్ గయి”(పాపం ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయింది) అని అంటే మరొకరు “ఆన్లైన్ లో షాపింగ్ చేస్తే షర్టు వచ్చింది గానీ షార్ట్ రాలేదు” అన్నారు. ఇంకొకడు “పాపం అమ్మలేదు.. బట్టలు ఎలా వేసుకోవాలో చెప్పేవాళ్ళు లేరు.. పాపను ఇబ్బంది పెద్దకండి!” అంటూ వెనకేసుకొచ్చాడు.

గ్లామర్ ఇండస్ట్రీలో ఉన్నవారికి ఇలాంటివన్నీ సహజమే. ట్రోలింగ్ బారిన పడడం జాన్వికి ఇదేమి మొదటి సారి కాదు. గతంలో ఒకసారి వైట్ డ్రెస్ లో కనిపించినందుకు విపరీతంగా ట్రోల్ చేస్తే జాన్వి కపూర్ అన్నయ్య అర్జున్ కపూర్ అందరికీ క్లాస్ పీకాడు.. ఆ ఫోటోలు ప్రచురించిన మీడియాకు గడ్డి పెట్టాడు. మరి ఈ సారి కూడా అర్జున్ ఫైర్ అవుతాడో లేదో వేచి చూడాలి.