కూతురి డేటింగ్‌కు శ్రీదేవి గ్రీన్‌సిగ్నల్?

0Jhanvi-boyfriend-Shikhar-pahariyaఅతిలోక సుందరి శ్రీదేవి గారాల పుత్రిక ‘జాన్వి’ఈ మధ్య బాగా పాపులర్ అయ్యింది. బాలీవుడ్‌లో ఎంట్రీ దగ్గర నుండి బాయ్ ఫ్రెండ్స్‌తో డేటింగ్‌తో పాటు జాన్వి తన ప్రియుడు శిఖర్‌ పహరియాను ముద్దుపెట్టుకోవడం, వీరిద్దరు లిప్‌ టు లిప్‌ కిస్‌ చేసుకున్న ఫొటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడం అవి పెద్ద దుమారాన్నే రేపాయి. దీంతో శ్రీదేవి కూతురు జాన్వి బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వకుండానే పెద్ద సెలబ్రిటీ అయిపోయింది.

అయితే మొన్నటి వరకూ శ్రీదేవి జాన్వి విషయంలో కొంచెం సీరియస్‌గా ఉందని కూతురికి గట్టిగా క్లాస్ పీకిందని వార్తలు వచ్చాయి. జాన్వి ప్రియుడు శిఖర్‌ మాజీ కేంద్రమంత్రి సుశీల్ కుమార్ షిండే మనవడు. అతనితో తన కూతురు డేటింగ్ చేయడం అతిలోక సుందరికి అస్సలు ఇష్టం లేదని అందుకే కూతురి డేటింగ్‌ నో చెప్పిందని వార్తలు వచ్చాయి.

కానీ తాజాగా షారుఖ్, అలియా భట్‌లు నటించిన డియర్ జిందగీ ప్రీమియర్ షోకి శ్రీదేవి, బోని కపూర్ దంపతులతో పాటు జాన్వి, శిఖర్‌లు కలిసి వెళ్లారు. ఇప్పుడు అందుకు సంబంధించిన ఫోటోలు బయటకురావడంతో శిఖర్, జాన్విల డేటింగ్‌కు శ్రీదేవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని బీటౌన్‌లో చర్చించుకుంటున్నారు.