తమిళోల్లు టైటిల్స్ మామూలుగా పెట్టరుగా

0సినిమా ఎంత బాగా తెరకెక్కించినా.. ఎంత మంది సూపర్ స్టార్ లు నటిస్తున్నా కూడా అందరిని ఎక్కువగా ఆకర్షించేది సినిమా టైటిల్స్ అని చెప్పాలి. సినిమా పేర్లు క్యాచీగా కొత్తగా అనిపిస్తే అప్పుడే సినిమాకు ప్రమోషన్స్ స్టార్ట్ అవుతాయి. అందుకే సినిమా వాళ్లు చాలా అలోచించి గాని సినిమా టైటిల్స్ ను సెట్ చేయరు. కోలీవుడ్ చిత్ర వర్గాలకు ఈ విషయంలో బాగా రాటు దేలరని చెప్పాలి. మొదట టైటిల్స్ తోనే ఆడియెన్స్ లో ఒక ఆలోచన కలిగిస్తారు.

ఇటీవల రిలీజ్ అయిన ఒక పోస్టర్ కూడా కోలీవుడ్ జనాలను బాగా ఎట్రాక్ట్ చేసింది. గొరిల్లా అని టైటిల్ సెట్ చేశారు. అంతే కాకుండా టైటిల్ లో ఎవరు ఊహించని విధంగా అందులో ఆర్ స్థానంలో రూపీ సింబల్ పెట్టి అదరగొట్టారనే చెప్పాలి. అందరూ గన్ లు పట్టుకొని ఉండడం పోస్టర్ లో కనిపిస్తోంది. అలాగే వారితో పాటు ఒక చిన్న చింపాంజీ కూడా కనిపిస్తోంది. రంగం ఫెమ్ జీవా సినిమాలో కథానాయకుడు. ఇక అర్జున్ రెడ్డి బ్యూటీ షాలిని పాండే హీరోయిన్ గా నటిస్తోంది.

వారితో పాటు కోలీవుడ్ టాప్ కమెడియన్స్ సినిమాలో సరికొత్తగా కనిపిస్తున్నారు. చూస్తుంటే పెద్ద దోపిడీ దొంగల్లానే సినిమాలో కనిపించున్నారు అనే టాక్ వస్తోంది. మొత్తానికి గొరిల్లా టైటిల్ తో తమిళోళ్ళు టైటిల్స్ మాములుగా పెట్టారుగా అని నిరూపించుకున్నారు. డాన్ శాండీ దర్శకత్వం వహిస్తున్న గొరిల్లా సినిమా అల్ ఇన్ పిక్చర్స్ నిర్మిస్తోంది.