జియో ఎఫెక్ట్‌: వోడాఫోన్‌ కొత్త ఆఫర్‌

0vodafone-4gసునామీలా దూసుకొచ్చిన రిలయన్స్ జియోకు కౌంటర్‌గా దేశీయ ప్రధాన టెలికాం ఆపరేటర్లు తన తారిఫ్‌లను, ఆఫర‍్లను ఎప్పటికపుడు సమీక్షించుకుంటున్నాయి. తద్వారా తమ కస్టమర్లను నిలుపుకొనేందుకు ప్రయత్నిస్తున్నాయి. తాజాగా వోడాఫోన్‌ తన వినియోగదారులకు మరో కొత్త ప్లాన్ ప్రకటించింది. ఆకర్షణీయమైన మొబైల్ డేటా ఆఫర్లతో వస్తున్న జియోను ఎదుర్కొనే ప్రణాళికలో భాగంగా వోడాఫోన్‌ రూ.244 రీచార్జ్‌పై 70 జీబి 4 జీ డేటా అన్‌ లిమిటెడ్‌ కాలింగ్‌ సదుపాయాన్ని అందిస్తోంది. 70 రోజుల పాటు చెల్లుబాటయ్యేలా ఈ పథకాన్ని వినియోగదారులకు అందిస్తోంది.

వోడాఫోన్ ఈ కొత్త ప్లాన్‌ రూ.244ల మొబైల్ డేటా ప్లాన్ కొత్త వినియోగదారులకు ప్రత్యేకంగా వర్తిస్తుంది. దీని ప్రకారం రోజుకు 1జీబీ డేటా ఉచితం. దీనికితోడు 70 రోజుల పాటు అపరిమిత కాలింగ్ సౌకర్యం పొందవచ్చు. రెండవ రీఛార్జి కోసం ఈ పథకంలో క్రొత్త వినియోగదారుడు అపరిమిత కాలింగ్ , డేటా సౌకర్యం కొనసాగుతుంది. అయితే ఈ ప్లాన్‌ చెల్లుబాటు 35 రోజులకు పరిమితం.