మా ఆవిడ కూడా అలానే తయారైంది: ఎన్టీఆర్

0Jr-NTR-on-Pawan-Kalyanబిగ్‌బాస్ షోలో విజేత ఎవరో తేలిపోయింది. షోలో హోస్ట్‌గా వ్యవహరించిన ఎన్టీఆర్ శివబాలాజీని విజేతగా ప్రకటించేశారు. దీంతో బిగ్‌బాస్ సీజన్1 ముగిసింది. తారక్ ఓ ప్రముఖ హెయిర్‌ఆయిల్‌ కంపెనీకి ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ ప్రమోషన్‌లో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడిన జూనియర్ ఎన్టీఆర్ కొద్దిసేపు బిగ్‌బాస్ జర్నీ గురించి మాట్లాడారు. అయితే ఈ సందర్భంగా ‘మీ అమ్మగారికి బిగ్‌బాస్ షోలో ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు?’ అని ఓ ప్రతినిధి ఎన్టీఆర్‌ను అడిగారు.

ఆ ప్రశ్నకు ఎన్టీఆర్ సమాధానమిస్తూ… ‘మా అమ్మకు నన్ను దాటి చూపు ఎక్కడికి వెళ్లదు’ అని సమాధానమిచ్చారు. ‘మా అమ్మే అనుకుంటే మా ఆవిడ కూడా అలాగే తయారైంది’ అని ఎన్టీఆర్ తన భార్య ప్రణతిని ఉద్దేశించి వ్యాఖ్యానించాడు. తన జీవితంలో ఇలాంటి ఇద్దరు మహిళలు ఉండటం తన అదృష్టమని ఎన్టీఆర్ చెప్పారు. ఇలా బిగ్‌బాస్ షోలోలాగానే మీడియా సమావేశంలో కూడా ఎన్టీఆర్ అందరిచేత నవ్వులు పూయించాడు. సీజన్-2లో కూడా మీరే హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారా అని అడగ్గా.. ఇది సందర్భం కాదంటూ ఎన్టీఆర్ సమాధానాన్ని దాటవేశారు.