బిగ్‌బాస్: గో.. గో ముమైత్ మళ్లీ రావొద్దమ్మా!

0jr-ntr-bigg-boss-episode-50-in-teluguశని, ఆదివారాల్లో బిగ్‌బాస్ షోలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి షోలో కరెంట్ పాస్ చేస్తుండటంతో ఆయన ఎంట్రీ కోసం నందమూరి అభిమానులతో పాటు.. బిగ్ బాస్ ప్రేక్షకులు కూడా ఆసక్తితో ఈ కార్యక్రమం కోసం ఎదురు చూస్తున్నారు. శనివారం నాటి 49వ ఎపిసోడ్‌లో ఎన్టీఆర్‌కు సీనియర్ యాంకర్ సుమ జతకలిసి బిగ్ బాస్ షోను హుషారెత్తించగా 50వ ఎపిసోడ్ ఎన్టీఆర్ ఫుల్ ఎనర్జీతో నడిపించారు

తెలుగు టెలివిజన్ చరిత్రలోనే బిగ్గెస్ట్ రియాలిటీ షోగా జూలై 16న ప్రారంభమైన బిగ్ బాస్ షో ఆదివారం నాటి ఎపిసోడ్‌తో సక్సెస్ ఫుల్‌గా 50 ఎపిసోడ్‌లను పూర్తిచేసింది. ఇక ఈరోజు ఎపిసోడ్ హైలైట్స్ విషయానికి వస్తే.. హౌస్‌లో ఉన్న కన్టిస్టెంట్స్‌తో నా టీవి ద్వారా ముచ్చటించారు. ఈ సందర్భంగా బిగ్ బాస్ హౌస్‌లో మీకు నచ్చిన వ్యక్తులు ఎవరో.. ఎందుకు ఇష్టమో చెప్పాలనగా సెలబ్రిటీ వారి వారి హ్యాపీ షేర్ ముమెంట్స్‌ను చేసుకున్నారు. అనంతరం బిగ్‌బాస్ హౌస్‌ మేట్స్ కోసం ఎన్టీఆర్ విజిల్ నోటపెట్టుకుని ఓ సరదా టాస్క్ ఆడించారు. ఆ టాస్క్‌లో చీటీలో రాసిన సినిమా పేర్లను యాక్షన్ చేసి చూపించాలనగా.. కన్టెస్టెంట్స్ పోటీ పడి ఆడిన ఈ టాస్క్ సరదా సరదాగా సాగింది.

ఇక ఎయిర్ టెల్ కాలర్ ఆఫ్ ది వీక్ లో విజయవాడ నుండి సబీనా హౌస్‌లో ఉన్న హరితేజతో మీ పెర్ఫామెన్స్ అదుర్స్ అంటూ మాట్లాడుతూనే అర్చనకు మీరు ఇంకాస్త బెటర్‌గా పెర్ఫామ్ చేయాలంటూ ఏదైనా మీకు చెప్పాలని పిస్తే డైరెక్ట్‌గా ఆ వ్యక్తితోటే మాట్లాడాలని ఇతరుల వద్ద చర్చించకుండా ఉంటే బాగుంటుందంటూ సలహా ఇచ్చారు. తాను ఎలిమినేషన్ కాకపోతే మీరు చెప్పిన సలహాలను పాటిస్తానంటూ అర్చన తెలిపింది.

ఇక ఎలిమినేషన్ విషయానికి వస్తే.. ఎలిమినేషన్ జోన్‌లో ఉన్న నవదీప్, ప్రిన్స్, దీక్ష, అర్చన, ముమైత్‌ ఖాన్‌లలో నవదీప్, ప్రిన్స్‌లు శనివారం నాటి ఎపిసోడ్‌లో సేఫ్ జోన్‌లోకి రాగా.. ఈరోజు ఎపిసోడ్‌లో దీక్ష, అర్చన సేఫ్ అయినట్టు ప్రకటించడంతో మిగిలిన ముమైత్ ఖాన్.. బిగ్‌బాస్ హౌస్‌నుండి ఎలిమినేట్ అయ్యింది. ఇప్పటికే రెండు సార్లు బిగ్‌బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన ముమైత్ చివరికి ఎలిమినేషన్‌ను తప్పించుకోలేకపోయింది. ఇవ వెళ్తూ వెళ్తూ బిగ్‌బాస్ ఇచ్చే బిగ్‌బాంబ్‌ను హరితేజపై విసిరింది ముమైత్. ఈ టాస్క్ ప్రకారం హౌస్‌లో ఉన్న కన్టెస్టెంట్స్ గేమ్స్ రూల్స్‌ను ఎప్పుడు అతిక్రమించినా హరితేజ వెళ్లి స్విమ్మింగ్ ఫూల్‌లో దూకాలంటూ బిగ్ బాంబ్ టాస్క్ ఇచ్చారు.