ఎన్టీఆర్ కోసం విక్రమ్ కథ!

0Vikram-Kumar-and-NTRవిలక్షణ పాత్రలకు పెట్టింది పేరు విక్రమ్. మాస్ క్యారెక్టర్లకు కేరాఫ్ అడ్రెస్ ఎన్టీఆర్. కథలు, సినిమాలు, మార్కెట్, క్యారెక్టర్ల పరంగా వీళ్లిద్దరి మధ్య ఎలాంటి కంపేరిజన్స్ లేవు. కానీ ఇప్పుడు యంగ్ టైగర్ మాత్రం విక్రమ్ రూట్లోకి షిఫ్ట్ అయ్యాడు. టెంపర్, నాన్నకు ప్రేమతో సినిమా నుంచి కొత్త కథలు ఎంచుకుంటున్న ఈ హీరో, త్వరలోనే బాబి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఫిబ్రవరి 10న ప్రారంభం కానున్న ఈ సినిమా కోసం ఓ రెండు కొత్త గెటప్స్ ట్రైచేయాలనుకుంటున్నాడు ఎన్టీఆర్. ఓ క్యారెక్టర్ కోసం కాస్త హెవీగా, మరో పాత్ర కోసం స్లిమ్ లుక్ లో కనిపించబోతున్నాడు. గతంలో ఎన్నో సినిమాల్లో విక్రమ్ ఇలానే తన బాడీతో ప్రయోగాలు చేశాడు. రీసెంట్ గా ఐ సినిమాలో కూడా విక్రమ్ ఇలానే చేశాడు. ఇప్పుడు ఇదే బాటలో తారక్ కూడా నడుస్తున్నాడు.

తాజా సమాచారం ప్రకారం.. బాబి దర్శకత్వంలో రాబోతున్న సినిమాలో మూడు పాత్రలు చేయబోతున్నాడట ఎన్టీఆర్. ఇందులో ఒక పాత్ర నెగెటివ్ షేడ్స్ లో ఉంటుందట. ఈ పాత్ర కోసం కండలు పెంచాలని ఫిక్స్ అయ్యాడు తారక్. టెంపర్ సినిమాలో సిక్స్ ప్యాక్ లుక్ కోసం తనకు ట్రయినింగ్ ఇచ్చిన ట్రయిలర్ ను మళ్లీ ప్రత్యేకంగా పిలిపించుకున్నాడట. ఇలా ఒకే సినిమాలో రెండు వేరియేషన్స్ చూపించడం కోసం ఎన్టీఆర్ ప్రస్తుతం జిమ్ లో తెగ కష్టపడుతున్నాడట.