బాబాయ్.. అయితే బ్రహ్మాండం అన్న ఎన్టీఆర్..!

0ntr-s-bigg-boss-2nd-promoయంగ్ టైగర్ ఎన్టీఆర్ టివి షో కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరించబోతున్నాడని తెలిసినప్పటి నుంచి ఆ వార్త సంచనలంగా మారింది. ఎన్టీఆర్ హోస్ట్ గా పాల్గొనబోయే బిగ్ బాస్ షో గురించి అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ షో ఎలా ఉండబోతోంది అనే విషయాలను ఎన్టీఆర్ తో పాటు బిగ్ బాస్ టీం ప్రెస్ మీట్ లో పాల్గొని వివరించారు.

బిగ్ బాస్ షో అందరిని ఆకట్టుకుంటుందని ఎన్టీఆర్ తెలిపాడు. ఇలాంటి షోలు బయట నుంచి చూడడమే కానీ ఎప్పుడూ పాల్గొనలేదని తెలిపాడు. ఈ నెల 13 నుంచి షూటింగ్ లో పాల్గొన బోతున్నట్లు ఎన్టీఆర్ తెలిపాడు. ఈ షో ఈ నెల 16 నుంచి ప్రారంభం కాబోతోంది. ఈ కార్యక్రమంలో బాలకృష్ణ నటించబోయే స్వర్గీయ నందమూరి తారక రామారావు బయోపిక్ గురించి కూడా ఎన్టీఆర్ మాట్లాడాడు. బాబాయ్ నటిస్తే అది బ్రహ్మాండమే అని ఎన్టీఆర్ అన్నాడు.