జూ.ఎన్టీఆర్ పొలిటికల్ పార్టీ ఇదే!

0ntrs-political-party-nameయంగ్ టైగర్ ఎన్టీఆర్ రాజకీయ నాయకుడి అవతారమెత్తారు. అవును బాబీ దర్శకత్వంలో ఆయన చేస్తున్న ‘జై లవ కుశ’ చిత్రంలో పొలిటీషియన్ గా కనిపించనున్నాడు. అందులో ఆయన పార్టీ పేరు ‘సమ సమాజ్ పార్టీ’. షూటింగ్ స్పాట్ నుండి బయటికొచ్చిన ఫోటోల ద్వారా ఈ విషయం తెలుస్తోంది. ఎన్టీఆర్ చేస్తున్న మూడు పాత్రలో ఒకటైన ‘జై’ పాత్రే రాజకీయనాయకుడు పాత్ర.

ఎన్టీఆర్ అండ్ టీమ్ టీజర్ తోనే నెగెటివ్ షేడ్స్ ఉన్న ఆ పాత్రపై అమితాసక్తిని రేకెత్తించగా ఆ పాత్రకు రాజకీయ నైపథ్యం కూడా ఉందని తెలియడంతో ఇనాతీ కథ ఎలా ఉంటుందో చూడాలనే తహ తహ మొదలవుతోంది. ఇకపోతే ఈ నెలాఖరున ఈ సినిమా యొక్క రెండవ టీజర్ ను విడుదలచేయనున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో రాశి ఖన్నా, నివేత థామస్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. నందమూరి కళ్యాణ్ రామ్ భారీ బడ్జెట్ తో స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమాను సెప్టెంబర్ 21న విడుదలకానుంది.