‘జ్యోతిలక్ష్మీ’ కూడా ఆ లిస్ట్‌లోకే చేరుతుందా?

0telugu-movie-jyothi-lakshmi-ఈమధ్యకాలంలో ఎక్కువ హైప్‌ వచ్చిన సినిమా, ఎక్కువ హైప్‌ తెచ్చిన సినిమా ‘జ్యోతిలక్ష్మీ’. లేడీ ఓరియంటెడ్‌ సబ్జెక్ట్‌ కావడం, ఈ సినిమాని పూరి జగన్నాథ్‌ డైరెక్ట్‌ చెయ్యడం, హీరోయిన్‌ ఛార్మి కూడా ఈ సినిమాకి ఒన్‌ ఆఫ్‌ ది ప్రొడ్యూసర్‌ అవ్వడంతో సినిమాకి కావాల్సినంత పబ్లిసిటీ వచ్చేసింది. పూరి జగన్నాథ్‌ కొన్ని సంవత్సరాల క్రితం చేద్దామనుకున్న ఈ సినిమా ఇప్పటికి ‘జ్యోతిలక్ష్మీ’గా తెరకెక్కింది. ఇటీవల సెన్సార్‌ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకొని యు/ఎ సర్టిఫికెట్‌ పొందిన ఈ చిత్రాన్ని జూన్‌ 12న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ చెయ్యబోతున్నారు. ఈ సినిమా పబ్లిసిటీలో భాగంగా ఛార్మి ఈ సినిమా గురించి, ఇందులో తన క్యారెక్టర్‌ గురించి తెగ చెప్పేస్తోంది. ఒక ప్రాస్టిట్యూట్‌ కథతో తెరకెక్కిన ఈ సినిమాని ఎంత వరకు ఆడియన్స్‌ రిసీవ్‌ చేసుకుంటారో తెలీదు. సినిమా ఇంకా రిలీజ్‌ అవ్వకపోయినా, సినిమా రిలీజ్‌ అయిపోయి సక్సెస్‌ని ఎంజాయ్‌ చేస్తున్న రేంజ్‌లో ఛార్మి ఆనందపడిపోతోంది. పనిలో పనిగా ఈ సినిమాకి సీక్వెల్‌ కూడా చేసేస్తాం అని ప్రకటిస్తోంది. లేడీ ఓరియంటెడ్‌ మూవీస్‌, అందునా ఒక ప్రాస్టిట్యూట్‌ కథాంశంతో రూపొందిన సినిమాలు తెలుగులో విజయం సాధించినవి చాలా తక్కువ. ‘జ్యోతిలక్ష్మీ’ గురించి చాలా ఎక్కువగా చెప్పడాన్ని చూస్తుంటే ఈ సినిమా కూడా గతంలో వచ్చిన చిత్రాల జాబితాలో చేరుతుందా అనే సందేహం కలుగుతోంది.