కాలా వసూళ్లు రాలా!

0సూపర్ స్టార్ రజనీకాంత్ కు గత కొన్నేళ్లుగా అందని ద్రాక్షగా మిగిలిన సక్సెస్ ని కాలా కసితీరా ఇస్తుంది అనుకుంటే మసిపూసి మారెడు కాయే మిగిలేలా ఉంది. హైప్ తక్కువగా ఉండటంతో నీరసంగా మొదలైన ఓపెనింగ్స్ కి దానికి తగ్గట్టు టాక్ నెగటివ్ గా రావడంతో కాలా తెలుగు వెర్షన్ పికప్ అయ్యే ఛాన్స్ కనుచూపు మేరలో కనిపించడం లేదు. వీక్ ఎండ్ కదా నిన్న రెండు రోజులు ఊపందుకోవచ్చు అనే ట్రేడ్ అంచనాలు తలకిందులు చేసింది. కబాలి చేదు ఫలితాన్ని ఇచ్చినా అది మర్చిపోయి దర్శకుడి మీద నమ్మకంతో రంజిత్ పా కు మరో అవకాశం ఇచ్చిన తలైవా దానికి తగ్గ రిజల్ట్ బాక్స్ ఆఫీస్ దగ్గర చూస్తున్నాడు. తమిళనాట ఇమేజ్ దృష్ట్యా బాగానే రన్ అవుతున్నప్పటికీ మన ప్రేక్షకులు నచ్చని కంటెంట్ ని తిప్పికొట్టడంలో మొహమాట పడటం లేదు. నాలుగు రోజులకు గాను కనీసం 7 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ కూడా తీసుకురాలేక కాలా సూపర్ స్టార్ కెరీర్ లో మరో బిగ్గెస్ట్ ప్లాప్ దిశగా అడుగులు వేస్తోంది. ఇక ఏరియాల వారీగా వసూళ్లు చూసుకుంటే ఈ విధంగా ఉన్నాయి

నైజామ్ – 2 కోట్ల 55 లక్షలు

సీడెడ్ – 98 లక్షలు

ఉత్తరాంధ్ర – 60 లక్షలు

గుంటూరు – 72 లక్షలు

ఈస్ట్ – 46 లక్షలు

వెస్ట్ – 36 లక్షలు

కృష్ణా – 49 లక్షలు

నెల్లూరు – 25 లక్షలు

తెలుగు రాష్ట్రాలు మొత్తం – 6 కోట్ల 41 లక్షలు

రజనీకాంత్ రేంజ్ స్టార్ కి నాలుగు రోజులకు ఈ షేర్ అంటే చాలా చాలా తక్కువ. ఓ మీడియం రేంజ్ హీరోకు వచ్చే తరహాలో కాలాకు రావడం చూసి ఫాన్స్ సైతం కలవరపడుతున్నారు. ఈ వారం నా నువ్వే-సమ్మోహనంతో పాటు రేస్ 3 కూడా విడుదల కానుండటంతో కాలాకు డ్రీం రన్ సాధ్యం కావడం కష్టమే. పైగా మౌత్ టాక్ కూడా ఆశాజనకంగా లేకపోవడంతో కాలా కూడా కబాలి సరసన చేరటం స్పష్టం . మాస్ కథ కాబట్టి బిసి సెంటర్స్ లో ఏమైనా ఆడొచ్చు అనే అంచనాలకు భిన్నంగా వసూళ్లు తీసికట్టుగా ఉండటంతో ట్రేడ్ నిరాశలో ఉంది. 27 కోట్ల దాకా ధియేట్రికల్ బిజినెస్ జరుపుకున్న కాలా ముప్పై శాతం వెనక్కు ఇచ్చినా గొప్పే అంటున్నారు. బ్యాడ్ లక్ తలైవా.