కాలా..ఓపెనింగ్స్ అంతగా లేవా..?

0సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా వస్తుందంటే ఆ ఓపెనింగ్స్ వేరేలా ఉంటాయి.. వారం ముందు నుండే థియేటర్స్ దగ్గర టికెట్స్ కోసం జనాలు ఎగబడతారు..బ్లాక్ లోనైనా టికెట్ కొని సినిమాను చూడాలని తహతహలాడుతుంటారు. అలాంటిది కాలా ఓపెనింగ్స్ విషయం లో మాత్రం కల తప్పింది. తమిళనాట సంగతి పక్కన పెడితే మన తెలుగు లో మాత్రం ఎక్కడ కూడా ఈ చిత్ర ఓపెనింగ్స్ భారీగా లేవని తెలుస్తుంది.

దీనికి ముఖ్య కారణం రజనీ గత చిత్రాల ప్రభావమే అని తెలుస్తుంది. భారీ హైప్‌తో వచ్చిన ‘లింగా’, ‘కబాలి’ చిత్రాలు ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపరిచాయి. పతాక స్థాయి అంచనాలతో.. అదిరిపోయేలా ఉంటాయని ఆ సినిమాలను చూసిన ప్రేక్షకులు నిరాశ చెందారు. ఆ రెండు చిత్రాల తర్వాత ఇప్పుడు రజనీ కాలా గా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రానికి కూడా కబాలిని రూపొందించిన డైరెక్టరే కావడం మరో నెగిటివ్ పాయింట్ అయ్యింది.

దీంతో ఈ సినిమా టాక్ చూసి సినిమా చూద్దామని అంత అనుకోవడం తో థియేటర్స్ దగ్గర ఓపెనింగ్స్ భారీగా పడిపోయినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం సినిమాకు పాజిటివ్ టాక్ వస్తుంది కాబట్టి రాబోయే రోజుల్లో కలెక్షన్స్ పెరిగే ఛాన్స్ ఉందని అంత అంటున్నారు. చూద్దాం కాలా ఏంచేస్తాడో.