‘కాలా’ ప్రీ రిలీజ్ హైలైట్స్..

0సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా కబాలి ఫేం పా. రంజిత్ దర్శకత్వం లో తెరకెక్కిన మూవీ ‘కాలా’. జూన్ 07 న ఈ సినిమా తమిళ్ , తెలుగు భాషల్లో విడుదల కాబోతుంది. ఈ సందర్బంగా చిత్ర యూనిట్ సోమవారం హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు. ఈ వేడుకకు రజనీకాంత్ తో పాటు చిత్ర నిర్మాత ధనుష్ కూడా హాజరయ్యారు.

ఈ సందర్భాంగా రజనీ మాట్లాడుతూ..1978లో అంతులేనికథతో తెలుగులో నా ప్రయణం మొదలైంది. ఆ తరువాత అన్నదమ్ములు సవాల్, ఇద్దరూ అసాధ్యులే.. ఇలా 15 చిత్రాలకు పైగా తెలుగు సినిమాలు చేశా. ఆ తరువాత చాలా గ్యాప్ వచ్చింది. ఇక తమిళంలో అవకాశాలు రావడంతో తెలుగులో చేయాలా.. తమిళంలో చేయాలా సందిగ్ధంలో ఉన్న సందర్బంలో బాల చందర్‌ గారు తమిళ్ సినిమా తీశారు. అయితే రజినీకాంత్‌ను తమిళంలో ఎంత ఆదరిస్తారో.. తెలుగు ప్రేక్షకులు అంతే ప్రేమను చూపిస్తున్నారు అది నా భాగ్యం. ఇక్కడకు వచ్చినప్పుడు ఎన్టీఆర్‌ని కలిసి ఆయన ఆశీర్వాదాలు తీసుకునే వాడిని. ఈ మధ్యకాలంలో ఎన్టీఆర్ నాకు బాగా గుర్తువస్తున్నారు. అది ఎందుకు అనేది మీకందరికీ తెలిసిందే.

ఆ తరువాత దాసరి నారాయణ రావుగారు నన్ను బిడ్డగా ఆదరించారు. అయితే ఇండస్ట్రీలో ఎవరికి వారే ప్రత్యేకం.. రజినీ ఒక్కరే.. చిరంజీవి ఒక్కరే.. నాగార్జున ఒక్కరే.. బాలయ్య ఒక్కరే.. ఇలా ఎవరికి వాళ్లు ప్రత్యేకం. అవకాశం దొరికితే శ్రమ తోడైతే ఫలం దొరకుతుంది. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉందని కాలా సినిమా అందర్నీ ఆకట్టుకుంటుందని తెలియజేసాడు.