కొండ చిలువతో ‘చందమామ’..

0

కాజల్ అగర్వాల్.. క్యూట్ బ్యూటీగా టాలీవుడ్ ను కొద్దికాలం పాటు ఏలింది. ఇప్పుడు నవతరం హీరోయిన్ల రాకతో ఆమె గ్రాఫ్ కాస్త తక్కువైంది. ఆడపాదడపా సినిమాల్లో నటిస్తూ అలరిస్తోంది. ఆమె కెరీర్ చివరి దశలో ఉందన్న మాటలు వినిపించాయి.. అయితే తాజాగా ఓ మంచి అవకాశం ఆమె తలుపుతట్టింది.

ప్రస్తుతం యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో కలిసి కాజల్ నటిస్తోంది. తేజ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం థాయ్ లాండ్ లో జరుగుతోంది. ఎప్పుడూ బిజి బిజీగా ఉండే కాజల్ తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో ఈ సినిమా అప్ డేట్స్ పోస్టు చేస్తూ సందడి చేస్తోంది.

తాజాగా థాయ్ లాండ్ లోని నఖోమ్ ఫాథోమ్ ప్రావిన్స్ లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ పార్క్ లోని ఓ కొండ చిలువను మెడలో వేసుకొని కాజల్ కెమెరాకు ఫోజిచ్చింది. ఏమాత్రం జంకు భయం లేకుండా సర్ ప్రైజ్ ఇచ్చింది. ఈ వీడియోను కాజల్ ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేయగా అది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Please Read Disclaimer