బాయ్ ఫ్రెండ్ కావాలంటున్న కాజల్

0Kajal-new-picఫన్నీగా చెప్పినట్లు చెప్పేసి.. చాలా పెద్దమాటనే పుటుక్కన అనేసింది చందమామ కాజోల్. సినిమా హీరోయిన్ అన్న వెంటనే అందం గురించి.. అమ్మడి ఇష్టాయిష్టాల గురించి..అంతా అయ్యాక పెళ్లి గురించి అడగటం మహా రొటీన్. ఏళ్లకు ఏళ్ల తరబడి ఇండస్ట్రీలో ఉన్న కాజల్ కు ఇలాంటివి కొత్తేం కావు. కానీ.. తాజాగా అమ్మడి నోటి నుంచి వచ్చిన మాట వింటే.. వార్నీ అనుకోవాల్సిందే.

అప్పుడెప్పుడో 2004లో వచ్చిన హిందీ మూవీతో తెరంగ్రేటం చేసిన చిన్నది.. 2007లో లక్ష్మీ కల్యాణంలో లక్ష్మి పాత్రతో తళుక్కున మెరిసింది. అయితే.. అమ్మడిలో అసలు అందం 2007లో రిలీజ్ అయిన చందమామతో కానీ బయటకు రాలేదు. ఆ తర్వాత నుంచి వెనక్కి తిరిగి చూసుకోకుండా పదేళ్లు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసేస్తోంది.

ఇప్పటికి తెలుగు.. తమిళంలో బిజీబిజీగా ఉన్న ఈ అందాల బొమ్మను పెళ్లి ఎప్పుడు సుమీ అన్న మాట అడిగినంతనే.. బాయ్ ప్రెండ్స్ గురించి చెప్పేస్తూ.. తనకు ఎవరూ లేరని.. మీకు తెలిసిన వాళ్లలో ఎవరైనా మంచి కుర్రాడు ఉంటే చెప్పాలని చమత్కారంగా చెప్పేసింది. చూస్తుంటే.. అమ్మడికి బాయ్ ఫ్రెండ్ ను సెట్ చేయటానికి బ్రోకరేజీ చేయమన్నట్లుగా అనిపించట్లేదు. నవ్వుతూ మాట చెప్పినా.. నరాలు పిండేసినట్లుగా లేదు..?